Women T20 World Cup 2024: బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్..యూఏఈ వేదికగా మహిళా టీ 20 వరల్డ్ కప్


Women T20 World Cup 2024: బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్..యూఏఈ వేదికగా మహిళా టీ 20 వరల్డ్ కప్
Women T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ లో కాకుండా యూఏఈ వేదికగా మహిళా టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులు అనుకూలంగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Women T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మహిళల T20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మార్చింది ఐసీసీ. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ దుబాయ్, షార్జాలలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ICC తన ప్రకటనలో, 'మహిళల క్రికెట్ పొట్టి ఫార్మాట్ మెగా ఈవెంట్ తొమ్మిదవ ఎడిషన్ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతుంది. దీనిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిర్వహిస్తుంది. మహిళల T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లు UAE, దుబాయ్ షార్జాలోని రెండు వేదికలలో జరుగుతాయని పేర్కొంది.
మేనెలలో ఐసీసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకరాం అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 వరల్డ్ కప్ జరగుతుంది. వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచులు షురూ అవుతాయి.
10 జట్లు పాల్గొంటున్నాయి
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ దేశాలు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



