IND vs ENG: చివరి టీ20లో మహ్మద్ షమీకి చోటు దక్కుతుందా? మ్యాచ్ కు ముందు కోచ్ ఏమన్నారంటే ?

IND vs ENG: చివరి టీ20లో మహ్మద్ షమీకి చోటు దక్కుతుందా? మ్యాచ్ కు ముందు కోచ్ ఏమన్నారంటే ?
x

IND vs ENG: చివరి టీ20లో మహ్మద్ షమీకి చోటు దక్కుతుందా? మ్యాచ్ కు ముందు కోచ్ ఏమన్నారంటే ?

Highlights

IND vs ENG: టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకుంటుందా అని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

IND vs ENG: టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకుంటుందా అని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో భారత్‌ నాలుగో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ 3-1తో తమ ఖాతాలో వేసుకుంది. అయినా, ఐదో మ్యాచ్‌ ఫిబ్రవరి 2న ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు చేస్తుందో ఆసక్తిగా మారింది. ముఖ్యంగా స్టార్‌ పేసర్‌ మోహమ్మద్‌ షమీకి మరో అవకాశం దక్కుతుందా? అన్నది అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది.

షమి గురించి కోచ్‌ ఏమన్నారంటే?

గాయంతో ఏడాది పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ, ఈ సిరీస్‌ ద్వారా తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ, ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అతనికి అవకాశం లభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతనిని బరిలోకి దించకపోగా, మూడో మ్యాచ్‌లో మాత్రం ఆడించాడు. అయితే, నాలుగో టీ20లో షమీని తిరిగి బెంచ్‌కి తగ్గించేశారు.. దీనిపై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ దీనిపై స్పందించాడు. ‘‘షమీకి వచ్చే మ్యాచ్‌లో అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నా. కానీ, ఏమి జరుగుతుందో చూడాలి. అతను మళ్లీ జట్టులోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అతని అనుభవాన్ని, జ్ఞానాన్ని యువ బౌలర్లతో పంచుకుంటున్నాడు. ఇది భారత క్రికెట్‌కి మంచి పరిణామం’’ అని మోర్కెల్‌ స్పష్టం చేశాడు.

షమీ ఫిట్‌నెస్, ఫామ్ ఎలా ఉంది?

అలాగే, షమీ ఫామ్‌ గురించి వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ, మోర్కెల్‌ మరింత స్పష్టత ఇచ్చాడు. ‘‘షమీ ప్రాక్టీస్‌లో చక్కటి బౌలింగ్‌ చేస్తున్నాడు. బ్యాట్స్‌మెన్‌కి కష్టతరమైన బంతులు వేస్తున్నాడు. అతని శక్తి, స్థిరత చూసినప్పుడు, ఫిట్‌నెస్‌ పరంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని అనిపిస్తోంది’’ అని మోర్కెల్‌ తెలిపాడు.

ఇక, టీమిండియా ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకున్న నేపథ్యంలో చివరి మ్యాచ్‌లో కొత్త అవకాశాలు కల్పించే అవకాశముంది. షమీ తన అనుభవంతో మెరిసి, ఈ మ్యాచ్‌లో విజయానికి తోడ్పడతాడేమో చూడాలి. ముఖ్యంగా, ఛాంపియన్స్ ట్రోఫీ ముందు షమీ తన పర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచుకుంటే, భారత బౌలింగ్ విభాగానికి మరింత బలమైన అస్త్రంగా మారనుండాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories