BCCI Awards : బీసీసీఐ అవార్డులకు డుమ్మా కొట్టిన విరాట్ కోహ్లీ

BCCI Awards
x

BCCI Awards : బీసీసీఐ అవార్డులకు డుమ్మా కొట్టిన విరాట్ కోహ్లీ

Highlights

BCCI Awards: 2025 ఫిబ్రవరి 1వ తేదీ శనివారం భారత క్రికెట్ కు ఓ ప్రత్యేకమైన రోజు. ముంబైలోని ఒక ఫైవ్-స్టార్ హోటల్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు, ఎమర్జింగ్ ప్లేయర్లను సన్మానించే కార్యక్రమం నిర్వహించారు.

BCCI Awards: 2025 ఫిబ్రవరి 1వ తేదీ శనివారం భారత క్రికెట్ కు ఓ ప్రత్యేకమైన రోజు. ముంబైలోని ఒక ఫైవ్-స్టార్ హోటల్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు, ఎమర్జింగ్ ప్లేయర్లను సన్మానించే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో అవార్డు గెలిచిన ఆటగాళ్ళతో పాటు భారత జట్టుకు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, ఇతర స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టుతో కలిసే ఉన్నారు. అయితే, ఈ వేడుకలో ఒక ముఖ్యమైన వ్యక్తి పాల్గొనలేదు.. ఆయనే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.



విరాట్ కోహ్లీ ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదు?

BCCI ప్రతీ ఏడాది ఈ అవార్డులను నిర్వహిస్తుంది.ఇందులో అంతర్జాతీయ క్రికెట్, దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను సన్మానిస్తారు. ఈ వేడుకలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ ఈ వేడుకలో పాల్గొనకపోవడానికి కారణం, అతను తన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొనడమే. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 12 సంవత్సరాల తర్వాత ఆడాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పాల్గొని, శనివారం మూడవ రోజున రైల్‌వే జట్టును ఓడించారు. కానీ కోహ్లీ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో, అతను అక్కడే ఉండడం వల్ల ఈ వేడుకకు చేరుకోలేకపోయారు.



ప్రత్యేక గిఫ్ట్ అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ

BCCI ఈ కార్యక్రమంలో మంచి ప్రదర్శన కనబరచిన టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టుకు ఒక ప్రత్యేక గిఫ్ట్ అందించింది. ఈ గిఫ్ట్ ‘పర్సనలైజ్డ్ రింగ్’ (వ్యక్తిగతంగా ఆటగాడి పేరు తో ఉన్న ఉంగరం) రూపంలో ఉన్నది. విరాట్ కోహ్లీ కూడా ఈ ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడు అయినప్పటికీ, అతను ఈ గిఫ్ట్‌ని అందుకోలేకపోయాడు. ఇటీవల జరిగిన వేడుకలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, యశ్వసి జయస్వాల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రిషబ్ పంత్, సంజూ శ్యామ్సన్ వంటి ఆటగాళ్లు ఈ ప్రత్యేక ఉంగరాన్ని అందుకున్నారు. కానీ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మొహమ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లకు ఈ రింగులు స్పెషల్ గా పంపారు. మొత్తం మీద, విరాట్ కోహ్లీ ఈ అవార్డ్స్ కార్యక్రమానికి అందుబాటులో లేకపోయినా, అతనికి ఈ ప్రత్యేక గిఫ్ట్ అందిస్తామని BCCI అధికారికంగా వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories