IPL 2025: కేఎల్‌ బ్రో లేకుండానే బరిలోకి ఢిల్లీ.. ప్చ్.. ఎంత కష్టమొచ్చింది భయ్యా..!

IPL 2025
x

IPL 2025: కేఎల్‌ బ్రో లేకుండానే బరిలోకి ఢిల్లీ.. ప్చ్.. ఎంత కష్టమొచ్చింది భయ్యా..!

Highlights

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో KL రాహుల్ తన ఐదో ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు.

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో KL రాహుల్ తన ఐదో ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. కానీ ఈ సీజన్ ప్రారంభానికి అతడి గైర్హాజరుతోనే మొదలవ్వనుందన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ నుంచి విడుదలైన తర్వాత, రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ భారీ 12 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఇప్పుడు ఆరు టాలెంటెడ్ టీముతో ఢిల్లీ మొదటి మ్యాచ్‌లు KL రాహుల్ లేకుండానే ఆడాల్సి రావచ్చు.

ఇది ఒక గాయం కారణంగా కాదు. KL రాహుల్, అతని భార్య అతియా శెట్టి తమ మొదటి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. దీని కారణంగా KL మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశముంది.

ఇక ఢిల్లీ ఇప్పటికే భారీ మార్పులతో సీజన్‌కి అడుగుపెడుతోంది. గతంలో జట్టుకు నాయకత్వం వహించిన రిషభ్ పంత్‌ను విడుదల చేయడంతో, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఫాఫ్ డుప్లెసిస్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ, KL రాహుల్ మాజీ జట్టు లక్నోతో విశాఖపట్నంలో తలపడనుంది. ఆ తర్వాత మార్చి 30న అదే వేదికలో సన్‌రైజర్స్‌ను ఎదుర్కొంటుంది. KL రాహుల్ టాప్ ఆర్డర్‌ను స్థిరంగా నడిపించే సామర్థ్యం కలిగిన ఆటగాడు. అతని గైర్హాజరీ ఢిల్లీకి నెగిటివ్‌ కానుంది. కానీ యువ ఆటగాళ్లలో ఉన్న పవర్‌తో, ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌ను గట్టి నమ్మకంతో ప్రారంభించాలని చూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories