ఇంకా నాలుగు ఎవరో తేలలేదు!

ఇంకా నాలుగు ఎవరో తేలలేదు!
x
Highlights

సరిగ్గా మూడు రోజుల్లో ప్రపంచ కప్ సంగ్రామం మొదలవబోతోంది. జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీసులో తలమునకలై ఉన్నాయి. మరో పక్క వార్మప్ మ్యాచులు ప్రారంభం అయిపోయాయి....

సరిగ్గా మూడు రోజుల్లో ప్రపంచ కప్ సంగ్రామం మొదలవబోతోంది. జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీసులో తలమునకలై ఉన్నాయి. మరో పక్క వార్మప్ మ్యాచులు ప్రారంభం అయిపోయాయి. ఎవరికీ వారు ఇంగ్లాండ్ గడ్డపై పరిస్థితులకు అలవాటు పడటానికి దాదాపుగా పూర్తిస్థాయి జట్లతో వార్మప్ మ్యాచుల్లో ఆడుతున్నారు. కానీ, భారత్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జట్టు కూర్పు విషయంలో ఇంకా ఒక తుది రూపు ఇప్పటివరకూ రాలేదు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరు దిగుతారు అనే విషయంలో పూర్తీ డైలమాలో జట్టు ఉంది. మిడిల్ ఆర్డర్ లో అతి కీలకమైన స్థానం నాలుగో స్థానం. ఓపెనింగ్ జోడీ ఎంత సమర్థంగా ఉండాలో అంతకు రెట్టింపు సమర్థత ఉన్న వారు నాలుగో స్థానంలో ఉండాల్సి ఉంటుంది.

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే వారు అవసరమైతే బ్యాటింగ్ యాంకర్ గా మారిపోవాలి.. లేదా హిట్టర్ గా మారిపోవాలి. జట్టు బ్యాటింగ్ పరిస్థితులకు అప్పటికప్పుడు అవసరమైన విధంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకుని విజయం దిశగా జట్టుకు సహాయం చేసే విధంగా ఉండాలి. ఇంత కీలకమైన ఈ స్థానానికి కొద్ది కాలంగా భారత జట్టులో సరైన వారు కుడురుకోవడం లేదు. వరల్డ్ కప్ కోసం అంబటి రాయుడు, అజింక్య రహానే లను పరిశీనించారు. కానీ, వారిలో నిలకడ లేమి ఇబ్బందిగా మారింది. దీనితో నాలుగో స్థానం లో ఆడే వారి కోసం పలు పేర్లను పరిశీలిస్తున్నారు. తాజాగా విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మహేంద్ర సింగ్‌ ధోని, కేదార్‌ జాదవ్‌ పేర్లనూ కొంతమంది సూచిస్తున్నారు. అయితే, వీరిలో ఎవరిని నాలుగో స్థానం లో ఆదిస్తారనేది ఇప్పటికీ తేలలేదు. కొద్ది సమయం మాత్రమె ఉండడంతో నాలుగో స్థానంలో ఆడే వారిని ఎంపిక చేయడానికి కోహ్లీ సేన కసరత్తు చేస్తోంది. ఏది ఏమైనా జట్టు కూర్పు కూడా విజయావకాశాలపై ప్రభావం చూపే ఆవకాశం ఉన్న పరిస్థితిలో ఇంకా టీమిండియా జట్టు కూర్పు పూర్తికాకపోవడం అభిమానుల్లో టెన్షన్ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories