Tax payers: టీమిండియా తరుఫున అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న ప్లేయర్లు ఎవరు? లిస్ట్‌లో ఊహించని పేర్లు!

Tax payers
x

Tax payers: టీమిండియా తరుఫున అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న ప్లేయర్లు ఎవరు? లిస్ట్‌లో ఊహించని పేర్లు!

Highlights

Tax payers: విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు చెల్లించి టాప్ ట్యాక్స్‌పేయర్‌గా నిలవగా, ధోనీ, సచిన్, గంగూలీ, పంత్ కూడా భారీగా పన్నులు చెల్లించారు.

Tax payers: క్రికెట్ మైదానంలో సిక్సర్లు కొట్టే వీరులు ఇప్పుడు దేశానికి కూడా బ్యాటింగ్ చేస్తున్నారు – ట్యాక్స్ రూపంలో! 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ దిగ్గజాలు చెల్లించిన ఆదాయపన్ను వివరాలు చూస్తే, వాళ్ల ఆట మానినా ఆ డబ్బు ఫ్లో మాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ఈ జాబితాలో ముందున్నది ఎవరో కాదు...విరాట్ కోహ్లీ. ఒక్క ఏడాదిలోనే రూ. 66 కోట్లు ఆదాయపన్ను చెల్లించిన ఈ స్టార్ బ్యాట్స్‌మన్, క్రికెట్‌తో పాటు తన వ్యాపారాలు, బ్రాండ్ డీల్స్ ద్వారా దంచికొడుతున్నాడు. ఆటలో కింగ్‌ అయితే, పన్నుల విషయంలో కూడా వేటలో ముందు వరుసలో ఉన్నాడు.

అటు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా, ఐపీఎల్‌తో పాటు ఎన్నో బ్రాండ్లకు ముఖచిత్రంగా కనిపించే అతను రూ. 38 కోట్లు ఆదాయపన్ను చెల్లించాడు. ఇక సచిన్ టెండూల్కర్ పేరు లేకుండా ఏ లిస్టు పూర్తవుతుందంటారు? మైదానాన్ని వదిలిపెట్టినా అభిమానులను మాత్రం వదల్లేదు. ఆయన 2024లో రూ. 28 కోట్లు చెల్లించాడు.

ఇవాళ ఆటలోనూ, బయటనూ దూసుకెళ్తున్న ఆటగాళ్లలో గంగూలీ (రూ. 23 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ. 13 కోట్లు), రిషభ్ పంత్ (రూ. 10 కోట్లు) నిలిచారు. పంత్‌కి గాయాల కారణంగా ఆటకు బ్రేక్ పడినా, ఆదాయానికి మాత్రం బ్రేక్ పడలేదు. గంగూలీ వ్యాఖ్యాతగా, నిర్వాహకుడిగా క్రికెట్‌లో నిండుగా సంపాదిస్తున్నాడు. అటు ఇతర సెలబ్రెటిల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ రూ. 92 కోట్లు చెల్లించి సెలబ్రిటీలలో టాప్ ట్యాక్స్‌పేయర్‌గా నిలిచాడు. విజయ్ (రూ. 80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 71 కోట్లు) వారి తరువాతి స్థానాల్లో ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories