చెలరేగిన స్మృతీ మంధాన ... మూడు వన్డేల సిరీస్ కైవసం

Smriti Mandhana
x
Smriti Mandhana
Highlights

విండిస్ మహిళ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ భారత్ మహిళ జట్టు కైవసం చేసుంది. మూడు వన్డేల సిరీస్ లో 2-1తో ఆరు వికెట్ల తేడాతో చేజిక్కించుకుంది.

విండిస్ మహిళ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ భారత్ మహిళ జట్టు కైవసం చేసుంది. మూడు వన్డేల సిరీస్ లో 2-1తో ఆరు వికెట్ల తేడాతో చేజిక్కించుకుంది.బుధవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టీమిండియా జట్టు 195 పరుగుల లక్ష్యాన్ని అలవకగా చేజిక్కించుకుంది.

తొలుత టాస్ గెలిచిన విండీస్ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటయ్యారు. వెస్టిండీస్‌ కెప్టెన్ స్టెఫానీ టేలర్‌ 79 పరుగులు చేసి రాణించింది. చివర్లో బ్యాటింగ్ వచ్చిన యాన్ కింగ్ 38 పరుగులు చేసింది. మిగతా ప్లేయర్లు రాణించలేదు. దీంతో విండీస్ 194పరుగులకు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌లు, గోస్వామి చెరో రెండు వికెట్లు సాధించగా, శిఖా పాండే, దీప్తి శర్మ రాజేశ్వరి గైక్వాడ్‌లు తలో వికెట్‌ తీశారు.

విండీస్ నిర్ధేశించిన 195పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి అలవకగా సాధించింది. గాయం కారణంగా రెండు వన్డేలకు దూరమైన స్మృతి మంధాన బ్యాటింగ్ తో విండీస్ బౌలర్లపై చెలరేగింది. దీంతో భారత్‌ 8 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్మృతీ మంధాన ఎంపికైయ్యారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కి వెండీస్ ప్లేయర్ కెప్టెన్ స్టెఫానీ టేలర్‌ ఎంపికైయ్యారు.

వెస్టిండీస్‌ మహిళా జట్టు తొలి వన్డేలో విజయం సాధించగా భారత్ మహిళా జట్టు రెండు మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్నారు. స్మృతి మంధాన 74 పరుగులు 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ రోడ్రిగ్స్‌ 92 బంతుల్లో 6 ఫోర్లు 69 పరుగులు సాధించింది. దీంతో భారత్ జట్టు 42.1 ఓవర్లలోనే విజయం సాధించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories