రెండో టీ-20లో చేతులెత్తేసిన టీమిండియా

West Indies Win the Five-Match Series
x

రెండో టీ-20లో చేతులెత్తేసిన టీమిండియా

Highlights

India vs West Indies 2nd T20: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ గెలుపు

India vs West Indies 2nd T20: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ సత్తా చాటింది. ఐదు వికెట్ల తేడాతో భారత్ పై విండీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన విండీస్ ఐదు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా చివరి వరకు పోరాడి ఓడింది. వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ 68 పరుగులు చేశాడు. డెవాన్ థామస్ 31 పరగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకు ముందు కైల్ మేయర్స్ 8, నికోలసర్ పూరన్ 14, హెట్ మేయర్ ఆరు పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆవేష్ ఖాన్, అర్ష్‌దీప్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. విండీస్ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories