Andre Russell: ఇక కేవలం 2 మ్యాచ్‌లే..అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్ బై

Andre Russell
x

Andre Russell: ఇక కేవలం 2 మ్యాచ్‌లే..అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్ బై

Highlights

Andre Russell: వెస్టిండీస్ క్రికెట్‌లో స్టార్ ఆల్-రౌండర్, పవర్‌హిట్టర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.

Andre Russell: వెస్టిండీస్ క్రికెట్‌లో స్టార్ ఆల్-రౌండర్, పవర్‌హిట్టర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టును ప్రకటించిన వెంటనే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లే రస్సెల్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లుగా నిలవనున్నాయి. స్వదేశంలో జమైకాలోని సబీనా పార్క్‌లో ఈ రెండు మ్యాచ్‌లను ఆడనున్నాడు.

2019 నుండి కేవలం టీ20 అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే ఆడుతున్న రస్సెల్, ఫిబ్రవరి 2026లో భారత్, శ్రీలంకల్లో జరగనున్న తదుపరి టీ20 ప్రపంచ కప్‌కు ఏడు నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వెస్టిండీస్‌కు పెద్ద షాక్. ఇంతకుముందు నికోలస్ పూరన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని, పూర్తి స్థాయిలో ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి సారించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నుండి పూర్తిగా రిటైర్ అయ్యే వరకు అతను ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడతాడు.

ఆండ్రీ రస్సెల్ వెస్టిండీస్ తరఫున రెండు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో కీలక సభ్యుడు. అతను 2012, 2016 టీ20 ప్రపంచ కప్‌లలో వెస్టిండీస్ విజయంలో పాలుపంచుకున్నాడు. రస్సెల్ వెస్టిండీస్ తరఫున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి 2 పరుగులు చేసి, 1 వికెట్ పడగొట్టాడు. 56 వన్డే మ్యాచ్‌లలో 1034 పరుగులు, 70 వికెట్లు తీశాడు. 84 టీ20 మ్యాచ్‌లలో 1078 పరుగులు చేసి, 61 వికెట్లు సాధించాడు. రస్సెల్ తన దూకుడైన బ్యాటింగ్, కీలకమైన వికెట్లు తీయగల సామర్థ్యంతో వెస్టిండీస్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.

ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో ఆండ్రీ రస్సెల్ పేరు ఉంది. ఈ జట్టులో షై హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్, జేసన్ హోల్డర్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటి, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories