స్వల్ప లక్ష్యాన్ని..సులభంగా చేధించిన విండీస్

స్వల్ప లక్ష్యాన్ని..సులభంగా చేధించిన విండీస్
x
West Indies
Highlights

లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక మ్యాచ్‌లో విండీస్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ 120పరుగులకే ఆలౌటైంది.

లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక మ్యాచ్‌లో విండీస్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ 120పరుగులకే ఆలౌటైంది. దీంతో విండీస్ ముందు 31 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 31పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

అఫ్గానిస్తాన్ ఓపెనర్‌ అహ్మదీ(62 పరుగులు, 93 బంతుల్లో 11 ఫోర్లు) సాధించాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు నిరాశపరిచారు. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ బౌలర్లలో హోల్డర్‌, కార్న్‌వాల్‌, రోస్టన్‌ ఛేజ్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కార్న్‌వాల్‌ ఎంపికైరడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 68/2తో మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్ 83.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ 90 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. విండీస్ బ్యాట్స్ మెన్స్ షామర్‌ బ్రూక్స్‌ (111 పరుగులు, 214 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీతో సాధించాడు. క్యాంప్‌బెల్‌ 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధసెంచరీతో రాణించాడు. డౌరిచ్‌ 42; 6 ఫోర్ల పరుగులు సాధించాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో అమీర్ ఆజ్మా ఐదు వికెట్లు తీసుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories