విండీస్ కొత్త కోచ్ ఇతనే..

విండీస్ కొత్త కోచ్ ఇతనే..
x
మాంటీ దేశాయ్‌
Highlights

డిసెంబర్ 6వ తేదీ నుంచి టీమిండియా, విండీస్ జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

డిసెంబర్ 6వ తేదీ నుంచి టీమిండియా, విండీస్ జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రధాన జట్ల వ్యూహాలకు పదును పెడున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో పొట్టి ఫార్మాట్ మొదలు కావడానికి రెండు రోజులు ముందుగా విండీస్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా మాంటీ దేశాయ్‌ ఎంపికయ్యారు. మాంటీ దేశాయ్‌ 2ఏళ్ల వరకూ విండీస్ బ్యాటింగ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు.

మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన జట్టుతో కలవనున్నారు. మాంటీ దేశాయ్‌కు కోచ్‌గా అనుభవం ఉంది. గతంతో అఫ్గానిస్తాన్, కెనడా, నేపాల్ వంటి జట్లకు కోచ్ గా పనిచేశారు. ఇండియాన్ ప్రిమియర్ లిగ్‌లోనూ గుజరాత్ లయన్స్, రాజస్తాన్ రాయల్స్‌కు కోచ్‌గా తన సేవలందించారు. మాంటీ దేశాయ్‌ రాజస్థాన్ రాయల్స్ మైరుగైన ఆటతీరును ప్రదర్శించింది.

మాంటీ రాకను విండీన్‌ ప్రధాన కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ స్వాగతించారు. గతంలో అతనితో కలిసి పనిచేశానన్నారు. ఆయన నేతృత్వంలోనే విండీస్ మరింత పటిష్టంగా తరయారవుతోందన్నారు. అనుభవంలేని ఆటగాళ్లతో సతమతమవుతున్న విండీస్‌కు బలాన్నిస్తుంది. టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది.

టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. దీంతో పరుగుల వరద ఖాయం అని భావిస్తున్నారు. ఇకపోతే, ఈ మ్యాచ్ కోసం విండీస్ టీమ్ సోమవారమే నాగరాయానికి చేరుకుంది. మంగళవారం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. ఇటు భారత్ జట్టు సభ్యులు ఒకొరొకరుగా మంగళవారం హైదరాబాద్ వచ్చారు. వరస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ను విండీస్ ఎంతవరుకూ ఎదుర్కొంటుదనేది చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories