టీమిండియాతో తలపడే వెస్టిండీస్ జట్టు ఇదే..

టీమిండియాతో తలపడే వెస్టిండీస్ జట్టు ఇదే..
x
West Indies
Highlights

టీమిండియాతో తలపడే వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి భారత్ విండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

టీమిండియాతో తలపడే వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి భారత్ విండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. రెండు విభిన్న ఫార్మాట్లకు కెపెన్‌గా విధ్వంసక ఆల్‌రౌండర్ పొలార్డ్ నియమిస్తూ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ ఆరున జరిగే తొలిటీ20 మ్యాచ్ హైదరాబాద్‌లో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రెండు, మూడు

ముంబైలలో నిర్వహిస్తారు. తర్వాత మూడు వన్డే సిరీస్ డిసెంబర్ 15 నుంచి ఆరంభం అవుతుంది.

భారత్ కంటే వెస్టిండీస్ జట్టు టీ20లో బలమైన జట్టు అనే చెప్పాలి. కీరన్ పొలార్డ్ డాషింగ్ హిట్టర్లు ఉన్న ఆ జట్టుపై అంచనాలు నెలకొని ఉన్నాయి. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాపై విండీస్‌కు మంచి రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్లు రెండు జట్లు చాంపియన్లే. వరస విజయామీద ఉన్న భారత్ విండీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అంతకు ముందు ఢిల్లీ మ్యాచ్ లో పసికూన బంగ్లా భారత్ కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సొంతగడ్డపై టీ20 కంటే వన్డే ఫార్మాట్ లోనే భారత్ మెరుగైనా స్థానంలో ఉంది. సొంత గడ్డపై భారత్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతే టీమిండియా విజయాలను తిరుగుండదు. స్వదేశంలో వరుస సిరీస్ లు గెలుస్తు వస్తున్న భారత్ విండీస్ పై కూడా సిరీస్ గెలిచి రికార్డు నెలకొప్పాలని చూస్తోంది.

వెస్టిండీస్ టీ20 జట్టు:

పొలార్డ్ (కెప్టెన్), షాయ్ హోప్, బ్రాండన్ కింగ్, పూరన్, హెట్‌మయర్, లూయిస్, ఖారీ పియర్, పాల్, హేడెన్ వాల్ష్, పాబియెన్ అలెన్, షెల్డన్ కొట్రెల్, రొమారియో షెఫర్డ్, జాసన్ హోల్డర్, దినేశ్ రామ్‌దిన్, కెసిరిక్ విలియమ్స్.

వెస్టిండీస్ వన్డే జట్టు:

పొలార్డ్ (కెప్టెన్), రోస్టన్ చేస్, అల్జారీ జోసెఫ్, షెల్డన్ కొట్రెల్, లూయిస్, రొమారియో షెఫర్డ్, సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, ఖారీ పియర్, బ్రాండన్ కింగ్, పూరన్, హెట్‌మయర్, జాసన్ హోల్డర్, పాల్, హేడెన్ వాల్ష్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories