
Vaibhav Sooryavanshi: ప్రాక్టీస్ లో సూర్యవంశీ విధ్వంసం.. సిక్సర్‌తో వాటర్ పైపు బద్దలు కొట్టిన వైభవ్
ప్రాక్టీస్ లో సూర్యవంశీ విధ్వంసం.. సిక్సర్‌తో వాటర్ పైపు బద్దలు కొట్టిన వైభవ్
Vaibhav Sooryavanshi : టీనేజ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ట్రైనింగ్ క్యాంప్‌లో చెమటోడుస్తున్న ఈ యువ కిశోరం, ప్రాక్టీస్ సెషన్‌లో తన బ్యాటింగ్ పవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈసారి అతను కొట్టిన భారీ సిక్సర్ ఒక రికార్డునో లేక బౌండరీనో తాకలేదు.. ఏకంగా గ్రౌండ్ పక్కనే ఉన్న వాటర్ పైపును ముక్కలు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో వైభవ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఒక బంతిని అతి వేగంగా సిక్సర్‌గా మలిచాడు. ఆ బంతి వెళ్ళి నేరుగా స్టేడియం వాటర్ పైపుకు బలంగా తగిలింది. బంతి తగిలిన వేగానికి ఆ పైపు పగిలిపోయి నీళ్లు బయటకు ఉబికివచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు వైభవ్ పవర్‌ను చూసి ఏం కొట్టావయ్యా సామీ! అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఐపీఎల్ మీద వైభవ్‌కు ఉన్న మక్కువ ఎంతటిదో ఈ ఒక్క సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ 2026 సన్నద్ధత కోసం అతను తన 10వ తరగతి బోర్డు పరీక్షలను కూడా వదులుకున్నాడు. పరీక్షల కంటే ప్రాక్టీస్ సెషన్‌లో పాలుపంచుకోవడం, తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడమే ముఖ్యమని భావించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఈసారి అంతకు మించిన అరాచకం సృష్టించేలా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న వైభవ్, రాబోయే ఐపీఎల్ 2026లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలనే కసితో ఉన్నాడు. అందుకే మైదానంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడు. నెట్స్ లో వాటర్ పైపులే పగిలిపోతుంటే, ఇక మ్యాచ్ లో బౌలర్ల పరిస్థితి ఏంటో అని క్రికెట్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




