
చెపాక్‌లో ధోని మళ్లీ పవర్ హిట్లతో మెరిశాడు. కెప్టెన్, ఫినిషర్, లెజెండ్‌గా ఈ సీజన్‌లో కూడా తన ముద్ర వేసేందుకు తలా సిద్ధంగా ఉన్నాడు.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు చెపాక్ స్టేడియంలో మరోసారి మాయ చేశాడు మహేంద్ర సింగ్ ధోని. ముంబై ఇండియన్స్‌తో మార్చి 23న జరగబోయే భారీ పోరుకు ముందు జరిగిన నెట్స్ సెషన్‌లో ధోని తన ట్రేడ్‌మార్క్ బిగ్ హిట్లతో అభిమానుల్ని ఫిదా చేశాడు. స్టాండ్స్‌లో బంతులు ఆడిన తల ఆటకు అభిమానులు ముగ్ధులై పోయారు. ఇది కేవలం ప్రాక్టీస్ అనిపించకుండా, ఒక చిన్న మ్యాచ్‌లా మారిపోయింది.
గత మూడు ఐపీఎల్ సీజన్లలో ఎక్కువగా బ్యాటింగ్ చేయని ధోని, తక్కువ ఓవర్లలో కానీ కీలక సమయాల్లో మ్యాచ్ మలుపు తిప్పే స్థాయిలో ఆడాడు. 34 మ్యాచ్‌ల్లో 497 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్‌లో కూడా ధోనీ పాత్ర అమోఘం. 3 స్టంపింగ్స్, 26 క్యాచ్‌లు పట్టాడు.
2022 సీజన్ మధ్యలో తిరిగి కెప్టెన్సీ చేపట్టిన ధోని, ఆ తర్వాత పూర్తిగా జట్టును ముందుండి నడిపిస్తూ, మరోసారి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఐదో టైటిల్‌తో ముంబై ఇండియన్స్‌తో సమంగా నిలిపాడు . ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఇప్పుడు కెప్టెన్‌గా రుతురాజ్ ఉన్నాడు.
ఈ సీజన్ ధోనికి చివరిది కావచ్చని ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో, బీసీసీఐ ఒక పాత నిబంధనను తిరిగి తీసుకురావడంతో, ధోనిని 'అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా' రూ. 4 కోట్లకు సన్‌రైజర్స్ రిటైన్ చేయగలిగారు. ఇది ఆయన క్రికెట్ జర్నీలో మరో కొత్త మలుపు. వయస్సు పెరిగిందని.. శక్తి తగ్గిపోతున్నదన్న మాటలన్నీ ఉత్త మాటలే అయ్యాయి. ఈ సీజన్‌లో ధోని మళ్లీ ఒక కొత్త సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని చెప్పబోతున్నాడు.
🎥 𝐅𝐫𝐞𝐬𝐡 𝐯𝐢𝐬𝐮𝐚𝐥𝐬, 𝐬𝐚𝐦𝐞 𝐢𝐜𝐨𝐧𝐢𝐜 𝐯𝐢𝐛𝐞𝐬! 🔊
— IndianPremierLeague (@IPL) March 21, 2025
Our first glimpse of MS Dhoni at the MA Chidambaram Stadium ahead of the #TATAIPL 2025 season! 🏟️ pic.twitter.com/P1jPxnSmJI

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




