IPL 2025: స్నేహమంటే ఇదేరా.. ధోనీని చూడగానే పాండ్యా ఏం చేశాడో చూడండి!

IPL 2025
x

IPL 2025: స్నేహమంటే ఇదేరా.. ధోనీని చూడగానే పాండ్యా ఏం చేశాడో చూడండి!

Highlights

IPL 2025: ధోనీ - హార్దిక్ హగ్‌ చేసుకున్న తీరు స్పోర్ట్స్‌మెన్‌షిప్‌కి అసలైన నిర్వచనం!

IPL 2025: ఐపీఎల్ 2025 మొదలయ్యే ముందు రోజు చెపాక్‌లో చోటు చేసుకున్న ఓ క్షణం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారణం? చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనీ - ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హగ్‌ చేసుకున్నారు.

ధోనీ - హార్దిక్ మధ్య బంధం క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే. ఒకరంటే గౌరవం, మరొకరంటే అభిమానం. హార్దిక్ కెరీర్ ప్రారంభం నుంచి ధోనీని గైడ్‌గా, మెంటార్‌గా చూశాడు. వాస్తవానికి పాండ్యా ఎదుగుదలకు ధోనీ ఇచ్చిన ప్రేరణే ముఖ్యకారణం. ఇద్దరూ కలిసి చాలా సందర్భాల్లో ఫినిష్ చేసిన మ్యాచ్‌లు ఇప్పటికీ అభిమానుల జ్ఞాపకాలలో ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు ధోనీ దగ్గరికి వెళ్లి సలహా తీసుకోవడం అనే అలవాటు హార్దిక్‌కి ఇప్పటికీ ఉంది.

అది వారి మధ్య ఉండే నమ్మకానికి, గౌరవానికి నిదర్శనం. ఇప్పుడు ఇద్దరూ తమ జట్లకు నాయకత్వం వహిస్తున్నా... వారి మధ్య ఆ స్నేహం, స్పోర్టింగ్ రిలేషన్ మాత్రం చెరగని గుర్తుగా నిలుస్తోంది. ఇక ఈ వీడియో కేవలం ఇద్దరు క్రికెటర్లు కలిసి నవ్వుకోవడమే కాదు.. ఇది ఒక తరం నుంచి మరో తరానికి దారి చూపే స్పూర్తిదాయక దృశ్యం. ఇందులో ఆట లేదు, స్కోర్‌బోర్డ్ లేదు.. కానీ స్పోర్ట్స్ స్పిరిట్ ఉంది.

ఇంకా విశేషం ఏమిటంటే, మైదానంలో చెన్నై వర్సెస్ ముంబై అంటే ఐపీఎల్‌లో క్లాసికల్ ఫైట్. కానీ మైదానం బయట మాత్రం ఈ ఇరు జట్ల ఆటగాళ్లు మంచి ఫ్రెండ్స్‌.



Show Full Article
Print Article
Next Story
More Stories