డే /నైట్ టెస్టు ఫార్మాట్‌లో వార్నర్ రికార్డు ట్రిపుల్ సెంచరీ


అడిలైడ్ వేదికగా పాకిస్థాన్ లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.
అడిలైడ్ వేదికగా పాకిస్థాన్ లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చిన వార్నర్ పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో వార్నర్ ( 335 పరుగులు 418బంతులు 39 ఫోర్లు 1సిక్స్)తో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 127 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 583పరుగుల సాధించి డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంబించిన పాక్ మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 302/1 రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లబూషేన్(162) వికెట్ కోల్పోయింది. కాగా.. ఇప్పటి వరకూ టెస్టుల్లో పాకిస్తాన్ సారథి అజహర్ అలీ(302 నాటౌట్) పేరిట ఈ రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. పింక్ బాల్ టెస్టుల్లో అజహర్ అలీ 456 పరుగుల రికార్డును అధిగమించాడు. దీంతో డే /నైట్ టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన 16వ ఆటగాడిగా వార్నర్ రికార్డుకెక్కాడు.
THREE HUNDRED for @davidwarner31!
— #7Cricket (@7Cricket) November 30, 2019
The highest ever Test score at Adelaide Oval 🔥#AUSvPAK pic.twitter.com/t9FlkhJOTp

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



