Virender Sehwag divorce: భార్యతో విడిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్.. 20ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు?

Virender Sehwag divorce: భార్యతో విడిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్.. 20ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు?
x
Highlights

Virender Sehwag divorce: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్... ఆయన భార్య ఆర్తి 20 ఏళ్ల వైవాహిక బంధానికి త్వరలోనే ముగింపు పలకపోతున్నట్లు వార్తలు...

Virender Sehwag divorce: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్... ఆయన భార్య ఆర్తి 20 ఏళ్ల వైవాహిక బంధానికి త్వరలోనే ముగింపు పలకపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2004లో వివాహం చేసుకున్న ఈ జంట ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నట్లు సమాచారం. దీంతో వారు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలా నెలలుగా విడిగా నివసిస్తున్నారని విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

దూకుడు బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన వీరేంద్ర, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులకు 2007లో ఆర్యవీర్, 2017 లో వేదాంత జన్మించారు. 20 ఏళ్లుగా అనోన్యంగా కలిసి ఉన్న సెహ్వాగ్, ఆర్తి ఇటీవల పలు పరిణామాలతో వారి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.

దీపావళి వేడుకల సందర్భంగా వీరేంద్ర తన కుమారులు తన తల్లితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ పోస్టుల్లో భార్య గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అలాగే పోస్టులో భార్య ఆర్తి ఫోటోలను షేర్ చేయలేదు. ఇలాంటి పరిణామాలు వారు విడిపోతున్నారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

కాగా రెండు వారాల క్రితం వీరేంద్ర పాలక్కాడ్ లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించి ఆ ట్రిప్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోలో ఆర్తి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అది వారి సంబంధంలో మనస్పర్ధలు ఉన్నట్లుగా మరింతగా సూచిస్తుంది. అయితే భార్య ఆర్తితో విడిపోవడంపై క్రికెటర్ దిగ్గజం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ జంట బహిరంగంగానే దూరంగా మెలగడం అటు క్రికెట్ వర్గాలు ఇటు వారి అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే న్యూఢిల్లీకి చెందిన ఆర్తి ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. పెద్దగా ప్రజల అటెన్షన్ కోరుకోరు. డిసెంబర్ 16, 1980న జన్మించిన ఆర్తి లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్, భారతీయ విద్యా విభవన్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో, మైత్రేయ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ డిప్లమా పూర్తి చేశారు. ఈ జంట ప్రేమకథ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. 2004లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 20 ఏళ్లుగా అన్యోన్యమైన జంటగా కనిపించారు. వీరేంద్ర క్రికెట్ కమిట్మెంట్లు వారి కుటుంబ జీతాన్ని సమతుల్యం చేసుకున్నారు. అయితే వారి సంబంధం కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉందని దీనివల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories