శాంటా క్లాజ్‌గా అందరిని ఆశ్చర్యపరిచిన విరాట్ కోహ్లీ

శాంటా క్లాజ్‌గా అందరిని ఆశ్చర్యపరిచిన విరాట్ కోహ్లీ
x
విరాట్ కోహ్లీ
Highlights

క్రిస్మస్‌ పండుగను విరాట్‌ కోహ్లి కోల్‌కతాలో ముందుగానే కొంతమంది చిన్నపిల్లలతో కలిసి జరుపుకున్నారు.

జీసస్ పుట్టిన దినాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఆరోజు జీసస్ ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పండుగంటే చాలా మంది చిన్నారులకు చెప్పలేని ఆనందం. శాంటా క్లాజ్ వచ్చి వారికి బహుమతులు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటారు.

శాంటా క్లాజ్ మారిపోయాడు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి. క్రిస్మస్‌ పండుగను విరాట్‌ కోహ్లి కోల్‌కతాలో ముందుగానే కొంతమంది చిన్నపిల్లలతో కలిసి జరుపుకున్నారు. శాంటా తాతలా గెటప్ వేసి సర్‌ఫ్రైజ్‌ చేశాడు. క్రిస్మస్‌ సందర్భంగా చిన్నపిల్లలకు బహుమతులు అందించాడు. వారితో కాసేపు శాంట తాతలా వేషం వేసుకున్న కోహ్లి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

శాంటా క్లాజ్ మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. ఏమిటో మీకు తెలుసా? సెయింట్ నిక్ , క్రిస్ క్రింగిల్‌ అని శాంటా తాతను పిలుస్తారు. అయితే సెయింట్ నికోలస్, క్రిస్ కిర్గిం, క్రిస్మస్ తాతయ్య లేదా శాంటా అని కూడా పిలవబడే, శాంటా క్లాజ్‌ క్రిస్టియన్ సంస్కృతిలోని ఒక ప్రత్యేక వ్యక్తి, ఇతను క్రిస్మస్ ఈవ్ ఉదయం సమయంలో బాగా ప్రవర్తించిన పిల్లల యొక్క గృహాలకు బహుమతులు తీసుకువస్తారని ప్రసిద్ధి. అయితే కోహ్లీ వేషం ధరించి చిన్న పిల్లలతో ఆడుకోవడంతో వారికి బహుమతులు ఇవ్వడంపై నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories