నీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకు.. కోహ్లీ లేఖకు అభిమానులు ఫిదా

నీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకు.. కోహ్లీ లేఖకు అభిమానులు ఫిదా
x
Highlights

టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం జన్మదిన వేడుకలని జరుపుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం జన్మదిన వేడుకలని జరుపుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో అడుగుపెట్టాడు కోహ్లి. 2008లో అండర్ 19 జట్టుకు అతని సారధ్యంలో ప్రపంచకప్ అందిచాడు. ఆ తర్వాత తన ఆటతీరుతో భారత జట్టులో చోటు సంపాదించి నెంబర్ వన్ ఆటగాడిగా ఎదిగాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో రికార్డులను అతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ప్రపంచ రెండో బెస్ట్ బ్యాట్స్‌మేన్‌గా ఉన్నాడు.

అయితే కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఓ భావోద్వేగ లేఖ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ(చీకు) ముద్దుపేరుతో సంబోధిస్తూ.. హయ్ చీకు నీకు పట్టిన రోజు శుభాకాంక్షలు. భవిష్యత్‌పై నీకు అపోహలు ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు. నీ మదిలో అనేక ప్రశ్నలు ఉన్నాయని అనుకుంటున్నా వాటికి సమాధానాలు నేను చెప్పలేను, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రతీ అనుభుతిని ఆస్వాధించు, గమ్యం కంటే ప్రయాణం ముఖ‌్యమైందని గుర్తుంచుకో, ప్రతీ అవకాశాన్నిచేజారనీయకు ఉపయోగించుకో, ఓటమికి కంగిపోకు, గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉండు, గెలిచే వరకు నిలబడు, అభిమానించే వాళ్లు, విమర్శించే వాళ్లు ఉంటారు.

మీ నాన్న కొన్ని సందర్భాల్లో నీ పట్ల కఠినంగా ఉండివుండవచ్చు కొన్ని సార్లు అర్దం చేసుకోరని నీకు అనిపించవచ్చు . కానీ అందరికంటే తల్లిదండ్రులే నిన్ను అర్ధం చేసుకుంటారు. నువ్వు కూడా తల్లిదండ్రులను ప్రేమించు‎. కుటుంబ సభ్యులను కూడా ఎక్కువగా ప్రేమించు. నీరంతరం పోరాటం చేస్తునే ఉండు. మన కలలు జీవితాన్ని మారుస్తాయి ‎అంటూ కోహ్లి లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖను చూసిన అభిమానలు ప్రశంసలు కురిపిస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories