IND vs PAK: పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ ఆయన రికార్డులను బద్ధలు కొడతాడా ?

IND vs PAK: పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ ఆయన రికార్డులను బద్ధలు కొడతాడా ?
x

IND vs PAK: పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ ఆయన రికార్డులను బద్ధలు కొడతాడా ?

Highlights

IND vs PAK: నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్ద రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

IND vs PAK: నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్ద రికార్డు సృష్టించే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది ఉత్కంఠభరితంగా ఉంటుంది. అదే భారత జట్టు ఈ మ్యాచ్ లో పాక్ ను ఓడిస్తే సెమీ-ఫైనల్స్‌కు కూడా చేరుకుంటుంది. అలాగే టోర్నమెంట్ నుంచి పాక్ ను బయటకు పంపిస్తుంది.

విరాట్ కోహ్లీ టోర్నమెంట్‌లో శుభారంభం చేయలేదు. మొదటి మ్యాచ్‌లో అతను కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్ 38 బంతుల్లో ఒకే ఒక ఫోర్‌ కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 57.89మాత్రమే. అయితే, పాకిస్తాన్‌పై తన ప్రదర్శన గత మ్యాచ్ ల్లో అద్భుతంగా ఉంది. అందుకే ఈ మ్యాచ్ అతడికి చాలా ప్రత్యేకంగా మారనుంది. ఈ మ్యాచ్ అతడికి 299వ వన్డే అవుతుంది.

వన్డేల్లో 14,000 పరుగుల రికార్డు

వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని దాటడానికి విరాట్ కోహ్లీకి పాకిస్థాన్‌పై కేవలం 15 పరుగులు అవసరం. అలా చేస్తే, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించనున్నాడు. అలాగే, 300 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడు అవుతాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే 14,000 వన్డే పరుగులు చేశారు.

వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు సాధించిన ఆటగాళ్లు

సచిన్ టెండూల్కర్: ఇన్నింగ్స్‌లో 350 (2006)

కుమార్ సంగక్కర: 378 ఇన్నింగ్స్‌లలో (2015)

ఇప్పటివరకు కోహ్లీ 286 వన్డే ఇన్నింగ్స్‌లలో 13,985 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 57.78. 2023 ప్రపంచ కప్‌లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును కూడా కోహ్లీ అధిగమించాడు.

ఇటీవలి కాలంలో కోహ్లీ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను ఐదు టెస్టుల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్‌లో తను ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. దీని తరువాత, స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా తన ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. అక్కడ అతను ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 93 ​​పరుగులు మాత్రమే చేశాడు. శ్రీలంక పర్యటనలో కూడా తను మూడు వన్డే ఇన్నింగ్స్‌లలో 58 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ ఏడాది ప్రారంభంలో మోకాలి గాయం కారణంగా కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే నుండి వైదొలగాల్సి వచ్చింది. రెండో వన్డేలో అ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే, అతని చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదు సార్లు అతను లెగ్ స్పిన్నర్ చేతిలో ఔటయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories