కోహ్లీ రోడ్డుపై నడుచుకుంటూ వె‌ళ్లినా పట్టించుకొని పబ్లిక్ !

కోహ్లీ రోడ్డుపై నడుచుకుంటూ వె‌ళ్లినా పట్టించుకొని పబ్లిక్ !
x
విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి
Highlights

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉంటారు. కోహ్లీ కనిపిస్తే చాలు ఫొటోల కోసం క్యూలు కడతారు.

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉంటారు. కోహ్లీ కనిపిస్తే చాలు ఫొటోల కోసం క్యూలు కడతారు. సెల్పీల కోసం వెంటపడతారు. ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారు. కానీ, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ కు వచ్చిన విరాట్ కోహ్లీని ఎవరూ పట్టించుకోలేదు. సెల్పీలు అడగలేదు ఆటోగ్రాఫ్‌లు అడగలేదు. కోహ్లీని పట్టించుకోకపోవడం ఏంటి అంటారా? బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ తో బీజీగా ఉన్న కోహ్లీ ఢిల్లీ ఎలా వచ్చారు అని అనుకుంటున్నారా?

అసలు విషయానికి వస్తే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ కాదు, అచ్చు కోహ్లీని పోలిన వ్యక్తి. అతను అచ్చుగుద్దినట్లు కోహ్లీలానే ఉన్నాడు. రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని చూసి కోహ్లీనే అనుకొని చాలా మంది భ్రమపడ్డారు. కొందరు అతను కోహ్లీ కాదని గుర్తుపట్టారు. కోహ్లీ ఇలా రోడ్డుపైకి వస్తే జనం కిక్కిరిసేవారు కదా అని ప్రశ్నించుకున్నారు. అయితే ఈ వీడియోను @amit_yadav2296 యాదవ్ అనే యూజర్ తన వ్యక్తిగత టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా పూర్తిగా ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాత కోహ్లీ కాదని నిర్థారించుకుంటున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories