మరో రికార్డుకు రెండు అడుగుల దూరంలో కోహ్లి

మరో రికార్డుకు రెండు అడుగుల దూరంలో కోహ్లి
x
Highlights

సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ల్లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ పూర్తయ్యాయి . అయితే అందులో భారత్ జట్లు రెండు టెస్టు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.

సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ల్లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ పూర్తయ్యాయి . అయితే అందులో భారత్ జట్టు రెండు టెస్టు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. అప్పటి వరకు సొంత గడ్డపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులను సైతం బద్దలు కొట్టింది. దీంతో టెస్టు ర్యాంకింగ్స్ లోను మొదటి స్థానంలో నిలిచింది.

టీంమిండియా కెప్టెన్ కోహ్లీ మరో మైలురాయిని చేరుకోవడానికి రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో సాధించిన కోహ్లి డబుల్ సెంచరీతో 37 పాయింట్లు సాధించాడు . టెస్టు మ్యాచుల్లో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోవడానికి కోహ్లి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 936 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్(937) కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 878 పాయింట్లతో మూడో స్థానంలో ఉంటే..భారత్ బ్యాట్స్‌మెన్ పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ, స్టీవ్‌స్మిత్ సమీపంలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో మరో టెస్టు మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో కోహ్లీ ఆగ్రస్థానం చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories