Virat Kohli: సగం సగం ప్రశ్నలొద్దు.. జర్నలిస్ట్‌లతో కోహ్లీ వాగ్వాదం

Virat Kohli: సగం సగం ప్రశ్నలొద్దు.. జర్నలిస్ట్‌లతో కోహ్లీ వాగ్వాదం
x
Virat Kohli file Photo
Highlights

న్యూజిలాండ్‌ టూర్ భారత కెప్టెన్ కోహ్లీ కెరీర్‌లో పీడ‌క‌ల‌గా మారిపోయింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ముగిసింది. ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో విజయం సాధించిన టీమిండియా.

న్యూజిలాండ్‌ టూర్ భారత కెప్టెన్ కోహ్లీ కెరీర్‌లో పీడ‌క‌ల‌గా మారిపోయింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ముగిసింది. ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో విజయం సాధించిన టీమిండియా.. తర్వాత వన్డే సిరీస్ 3-0తో, టెస్టు సిరీస్ 2-0తో ఓడిపోయింది. న్యూజిలాండ్‌ పర్యటనలో కెప్టెన్ కోహ్లీ ఘోరంగా విఫలమైయ్యారు. మూడు ఫార్మాట్లలో కో‍హ్లీ 218 పరుగులే చేశాడు. టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ రిపోర్టర్లపై చిందులేశాడు.

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కెప్టెన్ విలియమ్స్, ప్రేక్షకుల‌ను పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించారని రిపోర్టర్ ప్రశ్నించగా.. అన్ని తెలుసుకొని మాట్లాడాలని ఏదీ తెలియకుండా ప్రశ్నలతో విసిగించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రశ్నలు అడుగ‌వ‌ద్దని మంద‌లిచాడు. ఇప్పటికే మ్యాచ్ రిఫ‌రీకి సంజాయిషీ ఇచ్చాన‌ని కోహ్లీ తెలిపారు. ఆ సంఘ‌ట‌న‌ను ఆధారం చేసుకుని వివాదం సృష్టించే ప్రయ‌త్నం చేయ‌వ‌ద్దని హిత‌వు ప‌లికాడు.

మ‌రోవైపు గతంలోననూ 2018 ఇంగ్లాండ్ పర్యటనలోనూ కోహ్లీని విలేక‌రి విసిగించ‌గా. అప్పుడు కూడా త‌ను ఘాటుగా విమ‌ర్శించాడు. కోహ్లీ పేలవ ఫామ్ వల్ల కొనసాగించడం 2014 తర్వాత ఇది మరిసారి కావడం గమనార్హం. ఇక భారత్ తన తదుపరి సిరీస్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ నెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే 12న ధర్మశాలలో, రెండో వన్డే 15న ల‌క్నో, మూడో వన్డే 18న కోల్‌క‌తాలో జ‌రుగనున్నాయి. అయితే.. విరాట్‌ కోహ్లీకు విశాంత్రినిచ్చి, రోహిత్ గనుక ఫిట్‌గా లేకపోతే..వీరిలో ఒకరు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.



రిపోర్టర్ : విరాట్, మైదానంలో విలియమ్సన్ ఔటైనప్పుడు మీరు చేసిన సైగలు.. మీ అసభ్యకరమైన మాటలు.. అలాగే ప్రేక్షకులవైపు చేసిన అసభ్య సైగలకు అర్థం ఏంటి? టీమిండియా కెప్టెన్‌ మైదానంలో ఓ మంచి ప్లేయర్ ఉండదలుచుకోలేదా?

విరాట్ : ఏం అనుకుంటున్నావ్?

జర్నలిస్ట్: నేను మిమ్మల్ని ప్రశ్న అడిగా?

విరాట్ : నేను నిన్ను సమాధానం అడుగుతున్నా.

జర్నలిస్ట్: మీరు మైదానంలో సరిగ్గా ప్రవర్తించాల్సింది.

విరాట్: ఏం జరిగిందో తెలుసుకో. మంచి ప్రశ్నలతో రా... సగం సగం తెలుసుకొని ప్రశ్నలు వేయకు. నువ్వు వివాదాన్ని సృష్టించాడానికి ఇది సరైన వేదిక కాదు. నేను మ్యాచ్ రిఫరీతో కూడా మాట్లాడా. ఆ ఘటనపై అతనేలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories