ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ డౌన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ డౌన్
x
Virat Kohli File Photo
Highlights

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. ఈ ర్యా్కింగ్స్ లో కోహ్లీ స్థానం ఒకటి నుంచి రెండుకు దిగజారింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో కోహ్లీ 21 పరుగులు చేసి విఫలమైయ్యాడు. దీంతో కోహ్లీ ర్యాంక్ దిగజారింది. ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్‌స్మిత్‌ (911)తో ముందున్నాడు. విరాట్‌ కోహ్లీకి ఐదు పాయింట్లు తగ్గి 906 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా (360) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఆస్ట్రేలియా (296), న్యూజిలాండ్‌ (120) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

టీమిండియా చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌ టాప్‌-10లో నిలిచారు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ మళ్లీ అగ్రస్థానానికి వచ్చాడు. 2015లో తర్వాత స్మిత్‌ అగ్రస్థానానికి చేరుకోవడం ఏనిమిదో సారి కావడం విశేషం. 2015 తర్వాత కోహ్లీ, స్మిత్‌ను మినహాయిస్తే అగ్రస్థానంలో నిలిచిన ఒకేఒక్క ఆటగాడు కివీస్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ ఉన్నాడు‌. ప్రస్తుతం ఐసీసీ జాబితాలో మూడో ర్యాంకులో ఉన్నాడు. విలియమ్సన్స్ 2015 డిసెంబర్లో 8 రోజులు నంబర్‌వన్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ జరిగిన తొలి టెస్టులో 75 పరుగులు చేసిన రహానె ఏనిమిదో స్థానంలో, 92 పరుగులు చేసిన మయాంక్‌ అగర్వాల్‌ 10 ర్యాంకుల్లో నిలిచారు. నయా వాల్ ఛతేశ్వర్ పుజారా రెండు ర్యాంకులు తగ్గి 9వ స్థానానికిలో కొనసాగుతున్నాడు.

భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (765 రేటింగ్ పాయింట్లు) బౌలర్ల జాబితాలో 9వ ర్యాంకులో నిలిచాడు. భారత్ తరఫున టాప్‌-10 చోటు దక్కిన బౌలర్‌ అతనొక్కడే. కివీస్ తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల ఘనత సాధించిన ఇషాంత్‌ ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని 17వ స్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్ బౌలర్ టిమ్‌ సౌథీ 2014 జూన్‌ తర్వాత 5వ ర్యాంకు అందుకున్నాడు. బౌల్ట్‌ 4 స్థానాలు మెరుగై 13వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌-10లో జడేజా (3), అశ్విన్‌ (5) ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories