Virat Kohli: ఆహా అన్నారు.. ఓహో అన్నారు.. సీన్ కట్ చేస్తే.. తుస్ తుస్సుమన్నాడు!

Virat Kohli
x

Virat Kohli: ఆహా అన్నారు.. ఓహో అన్నారు.. సీన్ కట్ చేస్తే.. తుస్ తుస్సుమన్నాడు!

Highlights

Virat Kohli: క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ, ఐపీఎల్‌లో మాత్రం ఆర్‌సీబీకి చేదు జ్ఞాపకాలే మిగల్చుతున్నాడు.

Virat Kohli: 2008... అసలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటో కూడా తెలియని సమయంలో లలిత్ మోడీ ఆటని తలకిందులు చేసే ఐడియాతో ముందుకొచ్చాడు. టీం ఇండియా ల అప్పటి స్టార్లైనా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, ఇలా అందర్నీ తాము పుట్టి పెరిగిన ప్రాంతాలను రిప్రెసెంట్ చేస్తూ, ఫ్రాంచైజ్ కాన్సెప్ట్‌ను ముందుకు తెచ్చారు. ఆ తర్వాత ఇండియా లో క్రికెట్ క్రేజ్ ని సరిగ్గా కాష్ చేసుకున్న ఘనత లాలీ మోడీదే. ఇలా, బెంగళూరు జట్టులోకి పొగరున్న ప్లేయర్ ఒకడొచ్చాడు. అప్పట్లో 20 లక్షల రూపాయలకు విజయ్ మల్యా కొనుక్కున్న ఈ ఆటగాడు, పద్దెనిమిది ఏళ్ళైనా, అదే జట్టు లో ఉంటాడని.. ఇండియన్ క్రికెట్ లో తనకంటూ ఒక స్థాయిని, స్థానాన్ని సంపాదించుకుంటాడని ఎవరు ఊహించి ఉండరు. అతడే విరాట్ కోహ్లీ.

నిజానికి ఈ కుర్రోడిలో ఏదో స్పార్క్ ఉందని.. నమ్మి కొంచం పుష్ ఇస్తే, ఎక్కడికో వెళ్ళిపోతాడన్న కాంఫిడెన్స్ మొదట వచ్చింది మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకే. అందుకే, ఆ నమ్మకాన్ని, నిలబెట్టుకుని, విరాట్ కూడా ఆ టీం ని వదిలి ఎప్పుడు బయటకి వెళ్లాలనుకోలేదు. ఆర్.సి.బి అంటే విరాట్, విరాట్, అంటే ఆర్.సి.బి అన్న రేంజ్ లో క్రేజ్ తయారైంది. కానీ, బెంగళూరు హోమ్ గ్రౌండ్ ఐన చిన్నస్వామి స్టేడియం లో మాత్రం ఆ జట్టు పడే తంటాల భారీ నుంచి ఏ దేవుడు దిగొచ్చి కాపాడగలడో ఎవ్వరికి తెలీదు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ దేవుడు కొంత ప్రయత్నించినా ఫలితం ఇవ్వలేకపోయాడు. బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిచుంటే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉండగా దానిని చేజార్చేసి అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. మ్యాచ్ ఓడినా పరవాలేదు కానీ కోహ్లీ అయితే కనీసం స్కోర్ చేస్తాడని భావించిన అభిమానులకు ఈసారి ఏమీ చెప్పుకునేందుకు లేకుండా పోయింది. పైగా విరాట్ కోహ్లీ ఓ దురదృష్టకరమైన రికార్డును తన పేరుతో నమోదు చేసుకున్నాడు. పదెన్నిమిదేళ్ల క్రితం జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వేసిన భారీ లక్ష్యాన్ని చేధించే ప్రయత్నంలో బెంగళూరు జట్టు తీవ్రంగా విఫలమైంది. అప్పట్లో యువ ఆటగాడిగా ఉన్న కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు ఆ దృశ్యం మళ్లీ పంజాబ్‌తో మ్యాచ్‌లో మళ్లీ తలెత్తింది.

విరాట్ కోహ్లీ మరోసారి కేవలం ఒక్క పరుగు చేసి అవుట్ కావడంతో అభిమానులకు ఆ రాత్రి గడియలు మళ్లీ గుర్తొచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ, ఐపీఎల్‌లో మాత్రం ఆర్‌సీబీకి చేదు జ్ఞాపకాలే మిగల్చుతున్నాడు. అయినా ఇప్పటికైనా జట్టు మేలుకొని కోహ్లీ మరోసారి తన గొప్ప ఫామ్‌తో అభిమానులకు 2016 రోజులు గుర్తు చేసేందుకు వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories