ట్విట్టర్‌లో 5కోట్లకు చేరుకున్న కోహ్లీ ఫాలోవర్స్

Virat Kohli has 50 Million Followers on Twitter | Telugu News
x

ట్విట్టర్‌లో 5కోట్లకు చేరుకున్న కోహ్లీని ఫాలోవర్స్

Highlights

*5కోట్ల ఫాలోవర్స్ కలిగిన తొలి క్రికెటర్‌గా నిలిచిన విరాట్

Virat Kohli Twitter Followers: విరాట్‌ కోహ్లీ ఈ పేరు వింటే క్రికెట్‌ అభిమానులు మైమరిచిపోతారు. సోషల్ మీడియాలో కోహ్లీకి అభిమానుల కొదవలేదు. తాజాగా ట్విట్టర్‌లో కోహ్లీని అనుసరించే అభిమానుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా అతడు నిలిచాడు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తనకు ఎదురులేదని ఈ టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ నిరూపించాడు.

వేర్వేరు సామాజిక మాధ్యమాలు కలుపుకుని విరాట్‌ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 21కోట్ల1లక్ష పైనే ఉండటం విశేషం. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై అజేయ సెంచరీతో అదరగొట్టి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ పాంటింగ్‌తో సమంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories