Top
logo

కోహ్లీకి జరిమానా..ఎందుకో తెలుసా ?

కోహ్లీకి జరిమానా..ఎందుకో తెలుసా ?
Highlights

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ కార్పొరేషన్‌ అధికారులు జరిమానా విధించారు. కోహ్లీ స్వస్థలమైన...

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ కార్పొరేషన్‌ అధికారులు జరిమానా విధించారు. కోహ్లీ స్వస్థలమైన గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో పనిచేసే వాళ్లు చేసిన తప్పుకి కోహ్లీకి జరిమానా పడింది. కోహ్లీ ఇంట్లోని డజన్‌ కార్లు కడగడానికి లీటర్ల కొద్ది తాగునీటిని వాడుతున్నారట. ఈ విషయం గమనించిన పక్కింటి వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో కోహ్లీకి రూ.500 జరిమానా విధిస్తున్నట్లు చలానా జారీ చేశారు. కోహ్లీతో పాటు మరో 10 మందికి కూడా చలాన్లు జారీ చేసినట్లు మున్సిపల్ ఇంజినీర్ అమన్ ఫొగట్ పేర్కొన్నారు.


లైవ్ టీవి


Share it
Top