Virat Kohli: బ్యాటింగ్‌లో తమ స్థానాలు నిలుపుకున్నరాహుల్, కోహ్లీ

Virat Kohli: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తమ స్థానాలును పదిలపరుచుకున్నారు.

Kranthi
Updated on: 4 March 2021 10:44 AM IST
Rahul and Kohli Retained Their Place in the Batting
X

ఫైల్ ఇమేజ్


Cricket Updates: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో కేఎల్‌ రాహుల్ 816 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకోగా, కోహ్లీ (697) ఆరో ర్యాంకుల్లో కొనసాగుతూ తమ స్థానాలను పదిలపరుచుకున్నారు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌ (915) టాప్‌ ర్యాంక్‌ సాధించగా బౌలింగ్‌లో అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (736), తబ్రేజ్‌ షంసీ (దక్షిణాఫ్రికా), ముజీబుర్‌ రహ్మాన్‌ (బంగ్లాదేశ్‌) టాప్‌-3లో కొనసాగుతున్నారు. అయితే భారత బౌలర్లకు ఎవరికీ టాప్‌-10లో చోటుదక్కలేదు. ఆల్‌రౌండ్‌ విభాగంలో మహ్మద్‌ నబీ (అఫ్ఘాన్‌), షకీబల్‌ హసన్‌ (బంగ్లా), మ్యాక్స్‌వెల్‌ (ఆసీస్‌) టాప్‌-3లో కొనసాగుతున్నారు.

Kranthi

Kranthi

Next Story