ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. 9వస్థానంలో కోహ్లీ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. 9వస్థానంలో కోహ్లీ
x
Highlights

శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరీస్ లో టీమిండియా 2-0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరీస్ లో టీమిండియా 2-0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ విజయం అనంతరం తాజాగా అంతర్జాతీయ క్రికెట​ మండలి టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. దీంతో భారత క్రికెటర్లు తమ స్థానాలను ఈ సిరిస్‌లో మెరుగైన ప్రదర్శన చేశారు. శ్రీలంక సిరీస్‌లో రాణించిన టీమిండియా ఓపనర్ కేఎల్ రాహుల్ 760 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

మరోవైపు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ, శిఖర్ థావన్ తమ ర్యాంకులను కూడా మెరుగుపరుచుకున్నారు. 683 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు కోహ్లీ 10వ స్థానంలో కొనసాగుతు వచ్చాడు. పుణె వేధికగా జరిగిన చివరి టీ20లో ఓపెనర్ శిఖర్ ధావన్ 15 స్థానానికి ఎగబాకాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ నవదీప్‌ సైనీ 146 స్థానాలు ఎగబాకి ఏకంగా టాప్‌-100లోకి దూసుకొచ్చాడు. శ్రీలంలో జరిగిన చివరి టీ20 మ్యా్చ్ లో నవదీస్ షైనీ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశాడు. అంతే కాకుండా రెండు టీ20 మ్యాచుల్లో కలిపి ఐదు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎంపికైయ్యాడు. దీంతో నవదీప్ షైనీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో 98వస్థానంలో నిలిచాడు. యువ బౌలర్ శార్దూల్‌ ఠాకూర్‌ 92వ స్థానంలో ఉన్నాడు. చివరి మ్యాచ్ లో బంతితో కాకుండా బ్యాట్ తో కూడా రాణించాడు.

ఇక టీ20 ర్యాకింగ్స్ లో గత కొంతకాలంగా పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కూడా అజామ్ 879 రేటింగ్ పాయింట్స్ తో మొదటి స్థానాని పదిలం చేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ అరోన్ ఫించ్ 810 రేటింగ్ పాయింట్లతో 2వస్థానంలో నిలిచాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories