వైరల్ వీడియో : పొలార్డ్ వెకిలి చేష్టలు.. లగేజ్ బయట పడేసిన రోహిత్

వైరల్ వీడియో : పొలార్డ్ వెకిలి చేష్టలు.. లగేజ్ బయట పడేసిన రోహిత్
x
Rohit Vs Kieron Pollard
Highlights

రోహిత్ శర్మ, పొలార్డ్ ఇద్దరు ఐపీఎల్‌లో ముంబై జట్టు తరుపున ఆడుతున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది.

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, విండీస్ కెప్టెన్ పొలార్డ్ ఇద్దరు ఐపీఎల్‌లో ముంబై జట్టు తరుపున ఆడుతున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. కాగా, కొన్ని రోజుల క్రితం పోలార్డ్, రోహిత్‌ను ట్విటర్‌లో ఆన్‌ఫాలో కావడం, పైగా ఇద్దరి మధ్య కవ్వింపు చర్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. మూడు టీ20లు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టు భారత్ లో పర్యటించింది. మూడు టీ20 సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆదివారం జరిగిన మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డే భారత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మొదటి వన్డేలో భారత్ నిర్దేశించిన 288 పరుగుల విజయ లక్ష్యాన్ని విండీస్ ఆడుతూపాడుతూ ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేస్తే.. 47.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ 291 చేసి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ పొలార్డ్ భారత జట్టు ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ మధ్య ఓ రేంజ్ లో కవ్వింపు చర్యలు జరిగాయి. ఈ మ్యాచ్ లో 56 బంతు‎లు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్ల సాయంతో 36 పరుగులు ఔవుట్ అయ్యాడు. పోలార్డ్ 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి ఒక వికెట్ దక్కించుకున్నాడు. అయితే మ్యాచ్‌లో భారత జట్టు 12 పరుగల వద్ద ఉండగా విండీస్ కెప్టెన్ పొలార్డ్ నేరుగా రోహిత్ వద్దకు వచ్చి సంభాషిస్తూ నడుం, భుజాల్ని ఊపుతూ వెకిలి చేష్టలు చేశాడు. అయితే పోలార్డ్ చేసిన పనిని మాత్రం రోహిత్ లైట్‌గా తీసుకున్నాడు. పోలార్డ్ చర్యలు నవ్వు తెప్పించే విధంగా ఉండడంతో రోహిత్ నవ్వడం మొదలు పెట్టి తన బ్యాటింగ్ ప్రారంభించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.



భారత్ పర్యటనకి ముందు పోలార్డ్ రోహిత్ ట్విట్టర్‌లో అన్‌ఫాలో కావడం పలు సందేహాలకు దారి తీసింది. ఆ తర్వాత రోహిత్ తన కారులో పొలార్డ్‌ని విమానాశ్రయం నుంచి ఫికప్ చేసుకుని దారి మధ్యలో బ్యాగ్ బయటపడేయడం, అతన్ని వదిలేశాడు. అంతే కాకుండా అతను నిద్రపోతున్న బెడ్‌ పై పిల్లల బొమ్మలు ఉంచి రోహిత్ శర్మ ఇంకింతకు బదులు తీర్చుకున్నాడు. వీరిద్దరి మధ్య కవ్వింపులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రచారంలో వాడుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories