Vijay Hazare Tourney: పృథ్వీ షా డబుల్ సెంచరీ..టోర్నీలో రికార్డుల మోత

Vijay Hazare Trophy Prithvi Shaw Slams Double Century
x

పృథ్వీ షా (ఫోటో ట్విట్టర్ )

Highlights

Vijay Hazare Tourney: ముంబై కెప్టెన్ పృథ్వీ షా విజయ హజరే ట్రోఫీలో రికార్డుల మోత మోగించాడు.

Vijay Hazare Trophy: ముంబై కెప్టెన్ పృథ్వీ షా విజయ హజరే క్రికెట్ లో ట్రోఫీలో రికార్డుల మోత మోగించాడు. ఢిల్లీపై శతకం బాదిన షా.. ఈసారి పుదుచ్చేరిపై డబుల్ సెంచరీతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డ్ క్రియేట్ చేసింది.

గత ఐపీఎల్‌లో, ఆసీస్ పర్యటనలో ఫాంలో లేక ఇబ్బందులు పడ్డాడు పృథ్వీ షా. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో.. జరిగిన ఎలైట్ గ్రూప్ డి మ్యాచ్‌లో 142 బంతుల్లోనే ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. 152 బంతుల్లోనే 227 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో.. ముంబై జట్టు 4 వికెట్ల నష్టానికి 457 పరుగుల భారీ స్కోరు చేసింది.

అయితే శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ముంబై కెప్టెన్‌గా మారిన పృథ్వీ షా.. టోర్నీ చరిత్రలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గోవాపై సంజూ శాంసన్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. ముంబై ఓపెనర్ పృథ్వీ షాకు లిస్ట్ ఏ క్రికెట్లో ఇది తొలి ద్విశతకం కావడం విశేషం. షా దూకుడుతో విజయ్ హజారే టోర్నీలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డు క్రియేట్ చేసింది. గత వారం మధ్యప్రదేశ్‌పై జార్ఖండ్ చేసిన 422/9 స్కోరును ముంబై అధిగమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories