
CSK vs MI 2025: రోహిత్ శర్మ స్థానంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముంబై ఇండియన్స్ ఆటగాడు విఘ్నేష్ పుత్తూర్‌కు ఐపీఎల్‌లో అరంగేట్రం...
CSK vs MI 2025: రోహిత్ శర్మ స్థానంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముంబై ఇండియన్స్ ఆటగాడు విఘ్నేష్ పుత్తూర్‌కు ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని అతను పూర్తిగా ఉపయోగించుకుని తన ఐపీఎల్ అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. విఘ్నేశ్ తన తొలి ఐపీఎల్ వికెట్‌ను CSK కెప్టెన్ రీతురాజ్ గైక్వాడ్ రూపంలో తీసుకున్నాడు. ఆ తర్వాత అతను శివం దుబే (9)వికెట్ పడగొట్టడు. ఇలా అతను తన స్పెల్‌లో 32 పరుగులకు మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు.
రాహుల్ త్రిపాఠి వికెట్ తీసిన తర్వాత, రితురాజ్ గైక్వాడ్, రచిన్ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి CSKని బలమైన స్థితిలో ఉంచారు. ఆ తర్వాత తన తొలి మ్యాచ్ ఆడుతున్న విఘ్నేష్ పుత్తూర్ 2 వికెట్లు పడగొట్టడం ద్వారా ముంబై ఇండియన్స్ కు తోడుగా నిలిచాడు. ఎనిమిదో ఓవర్ ఐదవ బంతికి రుతురాజ్ గైక్వాడ్ (53) క్యాచ్ ఇచ్చే విధంగా బౌలింగ్ వేశాడు. ఇది అతని తొలి ఐపీఎల్ వికెట్. ఆ తర్వాత అతను 10వ ఓవర్లో శివం దుబే (9)ను అవుట్ చేశాడు. ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ విఘ్నేశ్ పుత్తూర్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విఘ్నేశ్ పుత్తూరు మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. అతను తన 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు. రితురాజ్ గైక్వాడ్, శివం దూబే తర్వాత దీపక్ హుడాను అవుట్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ 3 ఓవర్ల తర్వాత తన ఓవర్‌ను ఆపివేశాడు. ఇది పెద్ద తప్పు అని నిరూపణ అయింది. ఎందుకంటే అతను 3 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ముంబై జట్టుకు గట్టి పునాదిని వేశాడు విఘ్నేష్. ఈ మ్యాచ్‌లో CSK 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ జట్టు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
𝘼 𝙙𝙧𝙚𝙖𝙢 𝙙𝙚𝙗𝙪𝙩 ✨
— IndianPremierLeague (@IPL) March 23, 2025
Twin strikes from the young Vignesh Puthur sparks a comeback for #MI 💙
Updates ▶️ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @mipaltan pic.twitter.com/DKh2r1mmOx
ఎడమచేతి వాటం స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ 11 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. విఘ్నేష్ పుత్తూర్ కేరళలోని మలప్పురంలో జన్మించాడు. అతని తండ్రి ఆటో రిక్షా డ్రైవర్. కేరళ క్రికెట్ లీగ్ మొదటి సీజన్‌లో అల్లెప్పీ రిప్పల్స్ జట్టులో ఆడాడు. అతని అసాధారణమైన బౌలింగ్ శైలి ముంబై ఇండియన్స్ స్కౌట్స్‌ను ఆకర్షించింది. అతను సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025లో MI కేప్ టౌన్ కోసం నెట్ బౌలర్‌గా ఉన్నాడు. అతను అండర్-23 స్థాయి వరకు కేరళ కోసం క్రికెట్ ఆడాడు. అయితే సీనియర్ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించలేదు. అతను తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. IPL 2025 మెగా వేలం రెండవ రోజున ముంబై ఇండియన్స్ అతనిని 30 లక్షల ప్రాథమిక ధరకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




