Champions Trophy 2025: సినిమాలో నటించిన స్టార్‌ క్రికెటర్‌.. పాత ఫోటో నెట్టింటా వైరల్‌, ఆ సినిమా ఏది తెలుసా?

Varun Chakravarthy Movie Role and Viral Throwback Photo from Champions Trophy Win
x

Champions Trophy 2025: సినిమాలో నటించిన స్టార్‌ క్రికెటర్‌.. పాత ఫోటో నెట్టింటా వైరల్‌, ఆ సినిమా ఏది తెలుసా?

Highlights

Varun Chakravarthy Acted Movie Photo: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్ భారత్‌, న్యూజిల్యాండ్‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసింది.

Varun Chakravarthy Acted Movie Photo: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్ భారత్‌, న్యూజిల్యాండ్‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసింది. మన భారత క్రికెటర్లు అత్యంత ప్రతిభను చూపించారు. అయితే, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వరుణ్‌ చక్రవర్తి.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత ఆటగాళ్లు తమదైన శైలిలో ప్రతిభను చూపారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వరుణ్‌ చక్రవర్తి. స్పిన్‌ బౌల్స్‌ వేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పుట్టించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎక్కువ విక్కెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా వరణ్‌. అయితే, ఈ బౌలర్‌ ఓ తమిళ సినిమాలో నటించారని మీకు తెలుసా? ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపుతో వరుణ్‌ చక్రవర్తికి సంబంధించిన ఆ ఫోటో నెట్టింటా వైరల్‌ అవుతుంది. దీనిపై క్రేజీ కామెంట్లు కూడా పెడుతున్నారు.

వరుణ్‌ చక్రవర్తి మిస్టరీ స్పిన్స్‌ ప్రత్యర్థులకు చుక్కలు కనిపించాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపులో తన పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిదే. వరుణ్‌ చక్రవర్తి 'జీవా' అనే తమిళ సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్‌ ప్రధానపాత్ర పోషించారు. 2014లో ఈ సినిమా విడుదలైంది. ఇక హీరోయిన్‌గా శ్రీదివ్య నటించారు. ఇండియన్‌ నేషనల్‌ క్రికెట్‌లో ఆడాలనే కొంతమంది యువత కల సాకారం ఎలా అవుతుంది? ఈ మూవీలో చూపించారు.

ఒక సామాన్యుడు క్రికెటర్‌ అవ్వాలంటే అతడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాడు ఈ సినిమాలో బాగా చూపించారు. అంతేకాదు 'కుకూ విత్‌ కొమాలి'లో అనే కుకింగ్‌ షోలో కూడా వరుణ్‌ కనిపించారు. యాక్టింగ్‌, కుకింగ్‌ కాదు అతని గుండె చప్పుడు ఎప్పుడూ క్రికెట్‌. ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీ కూడా పొందారు. అయితే, 25 ఏళ్ల వయస్సులో వరుణ్‌ ఈ జాబ్‌ కూడా వదిలేసి క్రికెట్‌పై పూర్తి స్థాయిలో సమయం కేటాయించాడు.

2017-18 మొత్తం ఏడు మ్యాచుల్లో 31 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా ఈ సత్తా చాటాడు. ఆ తర్వాత పంజాబ్‌ XI 8.4 కోట్లకు కొనుగోలు చేశారు. మోకాళ్ల గాయాలతో బాధపడ్డాడు వరుణ్‌. తాజాగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో మళ్లీ తన సత్తా చాటాడు. అయితే, జీవా సినిమాలోని ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. హీరోకు మించిన లుక్‌ అని కామెంట్లు పెడుతున్నారు. వరుణ్‌ ఇప్పుడు నువ్వు రెడీ ఉంటే డైరెక్టర్లు, నిర్మాతలు నీతో సినిమా చేయడానికి రెడీ అంటున్నారు నెటిజెన్లు. అయితే, ఈ జీవా సినిమాలో వరుణ్‌ చక్రవర్తి గెస్ట్‌ రోల్‌లో కనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories