IPL 2025: వైభవ్ సూర్యవంశికి అసలు పరీక్ష నేడే.. బుమ్రా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తి!

IPL 2025
x

IPL 2025: వైభవ్ సూర్యవంశికి అసలు పరీక్ష నేడే.. బుమ్రా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తి!

Highlights

IPL2025: సెన్సేషనల్ సెంచరీతో ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశికి నేడే అసలైన సవాల్ ఎదురుకానుంది.

IPL2025: సెన్సేషనల్ సెంచరీతో ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశికి నేడే అసలైన సవాల్ ఎదురుకానుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వైభవ్ తన దూకుడును కొనసాగిస్తాడా? లేక బుమ్రా అతడికి కళ్లెం వేస్తాడా? చూడాలి.

భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశి. ఐపీఎల్ 2025లో 47వ మ్యాచ్‌లో అతడి మెరుపు ఇన్నింగ్స్ చూసిన వారెవరూ తమ కళ్లను నమ్మలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ గుజరాత్ టైటాన్స్ బౌలర్లందరినీ ఊచకోత కోసి, కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్ రికార్డుల పుస్తకాన్ని తిరగరాశాడు. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశికి ఒక పెద్ద పరీక్ష ఎదురుకానుంది.

వైభవ్ సూర్యవంశికి కీలక పోరు

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశి కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 11 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడు 265.78 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఇషాంత్ శర్మ వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన వైభవ్, మూడో బంతికి ఫోర్, ఆ తర్వాత రెండు బంతులను మళ్లీ సిక్సర్లుగా బాదేశాడు. చివరి బంతికి కూడా ఫోర్ కొట్టాడు.

కానీ వైభవ్ సూర్యవంశికి అసలైన పరీక్ష మే 1న జరగనుంది. ఆ రోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది. ఈ పోరులో వైభవ్ సూర్యవంశి ప్రస్తుత టీ20 క్రికెట్‌లోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోనున్నాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎంతో మంది స్టార్ బ్యాటర్లకే కష్టమైన పని. అలాంటిది వైభవ్ సూర్యవంశి అతని ముందు ఎలా ఆడతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జైపూర్‌లో ఎవరు పైచేయి సాధిస్తారు?

వైభవ్ సూర్యవంశి ఐపీఎల్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 50.33 సగటుతో 151 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ కూడా 215.71గా ఉంది. ఇది ఈ లీగ్‌లోని చాలా మంది స్టార్ ఆటగాళ్ల కంటే చాలా ఎక్కువ. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లోని అత్యంత పొదుపైన బౌలర్లలో ఒకడు. అతను కేవలం 7.31 ఎకానమీతో పరుగులు ఇస్తాడు. కాబట్టి జైపూర్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories