యూఎస్ ఓపెన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం

US Open Starts Today | Sports News
x

యూఎస్ ఓపెన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం

Highlights

Serena Williams: రాత్రి 8.30గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం, అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ పైనే దృష్టి

Serena Williams: యుఎస్‌ ఓపెన్‌ నేటినుంచి ఆరంభం కానున్నది. అత్యధిక పారితోషికం అందించే ఈ టోర్నీలో కొందరు మేటి ఆటగాళ్లు గైర్హాజరవుతున్నా.. ముఖ్యంగా సెరెనా విలియమ్స్‌, రాఫెల్‌ నాదల్‌లపైనే అందరి చూపు ఉంది. ఇక డేనియల్‌, ఎమ్మా రదుకాను తమ టైటిల్స్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. నొవాక్‌ జొకోవిచ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌లు వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమైనందున డేనియల్‌కే ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ ప్రధాన ఆకర్షణగా ఇవాళ యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి తెరలేవనుంది. 40 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించింది. మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఫైనల్‌ చేరినా.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 21వసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories