Under-19 ‌: గొడవపడిన బంగ్లా, భారత్ ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు

Under-19 ‌: గొడవపడిన బంగ్లా, భారత్ ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు
x
Highlights

అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్లో బంగ్లాదేశ్, టీమిండియా గొడవపై మాజీ సారథి బిషన్‌ సింగ్‌ బేడీ స్పందించారు. టీమిండియా ఆటగాళ్ల ప్రవర్తన సరైంది కాదన్నారు.

అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్లో బంగ్లాదేశ్, టీమిండియా గొడవపై మాజీ సారథి బిషన్‌ సింగ్‌ బేడీ స్పందించారు. టీమిండియా ఆటగాళ్ల ప్రవర్తన సరైంది కాదన్నారు. గ్రౌండ్‌లో అమర్యాదగా ప్రవర్తించిన టీమిండియా అండర్‌ 19 ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలో వారికి సహాయక సిబ్బంది తెలియజేయాలి. చెత్త ప్రదర్శన ఫర్వాలేదు. కానీ చెత్తగా ప్రవర్తించకూడదు అంటూ వ్యాఖ్యానిచారు. ఫైనల్ మ్యాచ్ లో ఎలాంటి దృశ్యాలు చూడకుడదో అలాంటివి చూపించారని ఎద్దేవా చేశారు. బూతులు తిట్టుకోవడమేంటని ఆసహనం వ్యక్తం చేశారు. భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ మాట్లాడారు.. అండర్‌ 19 ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలనే కానీ గొడవలు చేయడం సరికాదన్నారు.

తొలిసారి అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్లో చేరిన బంగ్లా జట్టు భారత్ పై మూడు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, విజయం అనంతరం బంగ్లా ఆటగాళ్లు, ఒక్కసారిగా మైదానంలోకి దూసురావడంతోపాటు భారత్ క్రికెటర్లపై వేకిలి చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఫీల్డ్‌ అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం ముగిసింది.

అయితే అండర్‌–19 ఆటగాళ్ల ప్రవర్తన ఐసీసీ చర్యలు చేపట్టింది లెవెల్‌–3 నియమావళికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. వరల్డ్ ‌కప్‌ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల 'అతి'గా సంబరపడిన భారత ఆటగాళ్లను దూషించడం, ఆవేశపడిన టీమిండియా ఆటగాళ్లపై సస్పెన్షన్‌ పాయింట్లు విధించింది. టీమిండియాకు చెందిన ఆకాశ్‌ సింగ్‌కు 8 సస్పెన్షన్‌ పాయింట్లు , లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్‌ పాయింట్లు ఐసీసీ విధించారు.బంగ్లాదేశ్‌ ప్లేయర్లలో తౌహిద్‌ హ్రిదోయ్‌ (10) సస్పెన్షన్‌ పాయింట్లు, షమీమ్‌ హుస్సేన్‌ (8‌) సస్సెన్షన్‌ పాయింట్లు, రకీబుల్‌ హసన్‌ (4 ‌) సస్సెన్షన్‌ పాయింట్లు విధిస్తూ ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్‌ ప్రవర్తించిన తీరుపై 5 డి మెరిట్‌ పాయింట్ల నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో టీమిండియా అండర్‌-19 ఆటగాడు రవి బిష్ణోయ్‌ తండ్రి మంగిలాల్ బిష్ణోయ్‌ స్పందించారు. రవి బిష్ణోయ్‌ అతడి సహచరుడిని రక్షించడానికే ఆవేశానికి గురయ్యాడని పేర్కొన్నారు. రవి బిష్ణోయ్‌ గొడవలకు దూరంగా ఉంటాడని అతను ఎంతో నెమ్మదస్తుడు. ఫైనల్‌ మ్యాచ్ లో ఏర్పడిన పరిస్థితులను వివరించాడు, బంగ్లా ఆటగాళ్ల దాడి నుంచి క్రికెటర్లు రక్షించే క్రమంలో ఆవేశానికి లోనైయ్యాడని తెలిపారు. ఐపీఎల్ వేలంలోనూ రవి బిష్ణోయ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.2 కోట్లుకు దక్కించుకుంది. అండర్‌-19 టోర్నీలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవి బిష్ణోయ్‌ నిలిచాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories