ICC U19 WORLD CUP : టీమిండియాతో తలపడే జట్టు ఇదే..

ICC U19 WORLD CUP : టీమిండియాతో తలపడే జట్టు ఇదే..
x
India Vs Pakistan u-19 World Cup
Highlights

ఆండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం జరగనుంది. ఇప్పటికే సెమిఫైనల్లో విజయంతో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.

ఆండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం జరగనుంది. ఇప్పటికే సెమిఫైనల్లో విజయంతో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. పాకిస్థాన్‌పై సెమీఫైనల్ ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ నిర్ధేశించిన 173 పరుగులను విజయలక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్ పాకిస్థాన్ పై గెలవడం ఇది ఐదో సారి. భారత్ 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో పాక్‌ను జట్టును చిత్తుగా ఓడించింది. యశస్వి జైస్వాల్ (105పరుగులు , 113 బంతులు, 8 ఫోర్లు, 4సిక్సర్లు) సత్తాచాటాడు. సక్సేనా ( 59పరుగులు, 99 బంతులు, 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ 14 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా..గురువారం జరిగిన రెండో సెమీస్ లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్లోకి దూసుకుపోయింది. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెఖమ్ వీలర్(75, 83 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సులు), నికోలస్ (44) మెరవడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. బంగ్లా బౌలర్లలో షోరిపుల్ ఇస్లామ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షమిమ్ హొసేన్, హసన్ మురద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

కాగా.. అనంతరం బంగ్లా 44.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో బంగ్లా తడబడినా మహ్మదుల్ హసన్ జాయ్ (100, 127బంతుల్లో 13 ఫోర్లు) శతకంతో మెరిశాడు. అతడికి తౌహిద్ హృదోయ్ (40) షహదత్ హొసేన్ (40) సహకారం అందించడంతో విజయం సాధించింది. బంగ్లా యువ జట్టు టైటిల్ రేసులోకి అడుగుపెట్టింది. ఆదివారం జరబోయే ఆండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో మ్యాచ్ లో భారత్ బంగ్లా పులులను ఎదుర్కొనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories