ఢిల్లీ మ్యాచ్‌లో బంగ్లా క్రికెటర్లు వాంతులు... ఆదేం లేదన్నముష్ఫికర్‌ రహీం

Bangladesh.
x
Bangladesh.
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో అరుణ్‌ జైట్లీ స్టేడియంలో బంగ్లదేశ్ భారత్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టీమిండియాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో అరుణ్‌ జైట్లీ స్టేడియంలో బంగ్లదేశ్ భారత్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టీమిండియాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో బంగ్లా క్రికెటర్లు ఇబ్బందులు పడ్డారని కాలుష‌్యంతో వారు సతమతమైయ్యారని ఓ ప్రముఖ చానల్ వెల్లడించింది. బంగ్లా కీలక ఆటగాల్లు సౌమ్య సర్కార్, మరో ఇద్దరు వంతులు చేసుకున్నారని కూడా ఆ చానల్ పేర్కొంది.

ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల తమకు ఇబ్బంది పెట్టలేదని బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీం చెప్పాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం అతను మాట్లాడుతూ...వాయు కాలుష్యం తమను ఇబ్బంది పెట్టలేదు. ఆటపైనే దృష్టి కేంద్రికరించాం.

కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అక్కడ టీ20 మ్యాచ్ నిర్వహించడంపై పర్యావరణ ప్రేమికులు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. మ్యాచ్ రద్దు చేయాలని తాము కోరినప్పటికి బీసీసీఐ నిరాకరించిందని అగ్రహం వ్యక్తం చేశారు. దీని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సమాధానం కూడా చెప్పారు. మ్యాచ్ వేధిక ఎప్పుడో అకుకున్నదని, ఇప్పటికిప్పుడు రద్దు చేయాలంటే కష్టమని తేల్చిచెప్పారు. అయితే తొలిటీ 20కాలుష్యాన్ని లెక్క చేయకుండా భారత్, బంగ్లా దేశ్ మ్యాచ్ ఆడడాన్ని ఆయన అభింనందించారు. ఇరు జట్లు ఆటగాళ్లకు ట్విటర్‌ ద్వారా గంగూలీ ధన్యావాదాలు తెలిపారు.


భారత్ బంగ్లా మధ్య రెండో టీ20 మ్యాచ్ నవంబర్ 7న జరగనుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టీ20పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే బంగ్లా, టీమిండియా మధ్య రెండో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్‌ వేధికగా జరగనుంది. అయితే గుజరాత్ లోని డయు, పోర్ బందర్ మధ్య మహా తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహా తుపాను తీరం దాటే ముందు రాజ్ కోట్ సహా చూట్టు ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మూడు టీ20ల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో ముందజలో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories