Chinnaswamy Stadium:ఘోర విషాదం తొక్కిసలాటలో ఏడుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం

చిన్నస్వామి స్టేడియంలో ఘోర విషాదం: తొక్కిసలాటలో ఏడుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం
x

చిన్నస్వామి స్టేడియంలో ఘోర విషాదం: తొక్కిసలాటలో ఏడుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం

Highlights

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు మరణించారు. అభిమానులు భారీగా చేరడంతో గందరగోళం ఏర్పడి తీవ్ర విషాదం నెలకొంది.

Tragedy at Chinnaswamy Stadium: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సెలబ్రేషన్స్ తీవ్ర విషాదానికి దారి తీశాయి. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అభిమానులు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్సీబీ విజయంలో మునిగిపోయిన అభిమానులు తమ అభిమాన జట్టును చూడాలని పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో కలిసి బెంగళూరుకు వచ్చిన నేపథ్యంలో స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి వేలాదిగా వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగింది.

మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొంది తొలి ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో బృహత్తర సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. తొలుత విధాన సౌధ నుంచి ర్యాలీగా ఆటగాళ్లు స్టేడియానికి రావాలని భావించినా, పోలీసుల అనుమతి లభించకపోవడంతో నేరుగా స్టేడియానికి వెళ్లారు.

అయితే ఆటగాళ్లు విధాన సౌధకు వస్తున్నారన్న వార్తతో అక్కడ కూడా భారీగా అభిమానులు గుమిగూడడంతో పరిస్థితి అదుపుతప్పింది. అధికారులు పరిస్థితిని నిలిపేందుకు ప్రయత్నించినా, క్షణాల్లో తొక్కిసలాట జరగడం పెద్ద ప్రాణ నష్టం కు దారి తీసింది. ప్రస్తుతం గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు ఘటనపై దర్యాప్తును ప్రారంభించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories