MI Vs RCB Preview: బరిలో హిట్టర్లు; హోరాహోరిగా తొలి మ్యాచ్

Tough Fight Between  Mumbai Indians vs Royal Challengers Bangalore IPL 2021Match
x

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ల మధ్య తొలి మ్యాచ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

MI Vs RCB Preview: ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది.

MI vs RCB Preview: ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ రోజు (శుక్రవారం) రాత్రి 7.30 గంటలకి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కి ముంబయి ఇండియన్స్ టీంలో పెద్దగా మార్పులు జరిగే ఛాన్స్‌లు లేవు. బౌలింగ్ విభాగంలోనే చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే బెంగళూరు టీమ్‌ చాలా మార్పులతో బరిలోకి దిగబోతోంది. ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్(రూ.15 కోట్లు), పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.14.25) లను మినీ వేలంలో దక్కించుకుంది విరాట్ కోహ్లీ టీం. వీరిద్దరి కోసం భారీగానే ఖర్చు చేసింది, వీరి నుంచి చాలా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది ఆర్సీబీ టీం.

హిట్టర్లతో బరిలోకి ముంబై..

ముంబై ఇండియన్స్

ఇక ముంబై ఓపెనర్లుగా రోహిత్ శర్మ, డికాక్ రానుండగా, మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఇక నెం.4 స్థానాన్ని ఇషాన్ కిషన్ పదిలం చేసుకోగా.. ఐదు, ఆరులో హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ ఆడనున్నారు. బౌలింగ్ లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ పేస్ దళం ఉన్నారు. అవసరాన్ని బట్టి హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లతో చెరో రెండు ఓవర్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్ స్టేడియం పిచ్‌ స్పిన్‌కి అనుకూలమైన నేపథ్యంలో.. ముంబయి ఇండియన్స్ టీమ్‌లో కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, పీయూస్ చావ్లా రూపంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. పీయూస్ చావ్లా మాత్రమే ముంబయి జట్టులోకి కొత్తగా వచ్చాడు.

రాయల్ బ్యాటింగ్ భారమంతా నలుగురిపైనే...

రాయల్ చల్లేంగెర్స్

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ ప్రారంభించనుండగా.. మూడో స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్ ఆడేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకూ నెం.3లో కోహ్లీ బరిలోకి దిగేవాడు. కానీ.. ఐపీఎల్ 2021 ఆరంభం నుంచి తాను ఓపెనింగ్ చేస్తానని విరాట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 4లో ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనున్నాడు. బ్యాటింగ్ బలమంతా ఈ నలుగురే మోయనున్నారు. ఇక ఐదో స్థానంలో డేనియల్ క్రిస్టియన్, ఆ తర్వాత హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రానున్నారు. బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, కైల్ జెమీషన్ పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక స్పిన్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్, గ్లెన్ మాక్స్‌వెల్ తమ సత్తా చాటనున్నారు.

తుది జట్ల అంచనా

ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, పీయూస్ చావ్లా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీషన్, చాహల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ

Show Full Article
Print Article
Next Story
More Stories