IND VS PAK: సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, రాహుల్.. టీమిండియా భారీ స్కోర్‌

Ton-up Virat Kohli, KL Rahul take India to 356 for 2 against Pakistan
x

IND VS PAK: సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, రాహుల్.. టీమిండియా భారీ స్కోర్‌

Highlights

IND VS PAK: అర్ధశతకాలు సాధించిన రోహిత్‌, శుభ్‌మాన్‌ గిల్‌

IND VS PAK: ఆసియా కప్‌ గ్రూప్‌4లో భారత బ్యాటర్లు చెలరేగారు. కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ సెంచరీలతో రెచ్చిపోగా.. పాటు రోహిత్‌, గిల్‌ హఫ్‌ సెంచరీలతో భారత్‌ 2 వికెట్ల నష్టానాకి 356 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత బ్యాట్‌మెన్ల ధాటికి పాక్‌ బౌలర్లు చేతులెత్తేశారు. పస లేని పాకిస్తాన్ బౌలర్లను భారత బ్యాట్‌మెన్ల చీల్చి చెండాడారు. పాక్‌ బౌలర్లలో షహీన్‌, షాదాబ్‌ మాత్రమే తలో వికెట్‌ పడగొట్టారు.

కొన్నాళ్లు ఫాం కోసం తీవ్రంగా కష్టపడుతున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు. సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్ బౌలర్లను చితక్కొట్టాడు. 84 బంతుల్లోనే వంద పరుగుల చేసి.. బ్యాంటింగ్ లో మరోసారి తన సత్తా చాటాడు. వన్డే మ్యాచుల్లో 47వ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో వేగంగా 13 వేల పరుగులు చేసిన ఆటగాడుగా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఓవరాల్‌గా అత్యధికంగా పరుగుల సాధించిన ఐదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

చాలా రోజుల తర్వాత టీమ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్..కరెక్ట్ టీమ్ పై కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కీలక దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్..పాక్ బౌలర్లను చితక్కొడుతూ..సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కాన్ఫిడెంట్ గా ఆడిన కేఎల్ రాహుల్..60 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ అయ్యాక..కేఎల్ రాహుల్ మరింత బాధ్యతతో బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో సరిగ్గా వంద బంతుల్లో సెంచరీ సాధించాడు. వన్డే కెరీర్‌లో కేఎల్ రాహుల్‌కి ఇది 6వ సెంచరీ.

Show Full Article
Print Article
Next Story
More Stories