భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య నేడు తొలి టెస్ట్‌ మ్యాచ్‌

* చట్టోగ్రామ్‌ వేదికగా మ్యాచ్‌ ప్రారంభం

R Tripura Malini
Published on: 14 Dec 2022 8:18 AM IST
Today Is The First Test Match Between India And Bangladesh
X

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య నేడు తొలి టెస్ట్‌ మ్యాచ్‌

India Vs Bangladesh: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియ సమాయాత్తమైంది. ఇవాళ్టీ నుంచి జరిగే టెస్ట్ క్రికెట్‌కు లోకేశ్ రాహుల్ సారథ్యం వహించబోతున్నారు. ఇవాళ భారత్-బంగ్లా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు దూరం కాగా కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అతడికి డిప్యూటీగా ఛెతేశ్వర్ పుజారా వచ్చాడు. మరోవైపు షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేరు. అయినప్పటికీ బౌలింగ్ లోనూ ఉమ్రాన్ మాలిక్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ ఉండగా విరాట్ కోహ్లీ, శ్రేయస్, పుజారా, రాహుల్, పంత్ లతో బ్యాటింగ్‌లోనూ టీమ్ ఇండియా బలంగానే ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. షకిబ్ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్ లు జరగనున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story