IND vs ENG : ఓవల్‌లో దాదాపు 123 ఏళ్లుగా ఎవరూ సాధించని రికార్డును ఇంగ్లాండ్ బద్దలు కొట్టగలదా?

IND vs ENG : ఓవల్‌లో దాదాపు 123 ఏళ్లుగా ఎవరూ సాధించని రికార్డును ఇంగ్లాండ్ బద్దలు కొట్టగలదా?
x

IND vs ENG : ఓవల్‌లో దాదాపు 123 ఏళ్లుగా ఎవరూ సాధించని రికార్డును ఇంగ్లాండ్ బద్దలు కొట్టగలదా?

Highlights

క్రికెట్ అభిమానులకు ఓవల్ టెస్ట్ అంటేనే టెన్షన్. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ టీమిండియాకు డు ఆర్ డై లాంటిది. ఓడిపోతే సిరీస్ చేజారుతుంది.

IND vs ENG : క్రికెట్ అభిమానులకు ఓవల్ టెస్ట్ అంటేనే టెన్షన్. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ టీమిండియాకు డు ఆర్ డై లాంటిది. ఓడిపోతే సిరీస్ చేజారుతుంది. గెలిస్తే ఓటమి బాధ నుండి బయటపడొచ్చు. కానీ ఓవల్‌లో గెలవడం అంత తేలిక కాదు. ఎందుకంటే, ఇక్కడ భారత్ రికార్డు దారుణంగా ఉంది. అంతేకాదు, ఒక శాపంలా వెంటాడుతున్న ఒక రికార్డు కూడా టీమిండియాను భయపెడుతోంది.

ఓవల్ టెస్ట్‌లో టీమిండియా గెలుపు దాదాపు ఖాయం అనిపిస్తుంది. దీనికి కారణం ఇంగ్లాండ్ ముందు భారత్ ఉంచిన 374 పరుగుల భారీ లక్ష్యం. ఇప్పటివరకు ఓవల్‌లో ఏ జట్టు కూడా ఇంత పెద్ద లక్ష్యాన్ని నాలుగో ఇన్నింగ్స్‌లో చేధించలేదు. ఈ మైదానంలో అత్యధిక ఛేదన రికార్డు కేవలం 263 పరుగులు మాత్రమే. ఈ రికార్డును ఇంగ్లాండ్ 1902లో ఆస్ట్రేలియాపై సాధించింది. ఇక రెండో అత్యధిక రికార్డు 1963లో వెస్టిండీస్ జట్టు 253 పరుగులు చేయడం. ఈ గణాంకాలను చూస్తుంటే ఇంగ్లాండ్ ఇప్పుడు గెలవాలంటే ఒక కొత్త చరిత్ర సృష్టించాల్సిందే. నాలుగో, ఐదో రోజుల్లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి, టీమిండియా గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ సాధించగా, ఆకాష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అర్ధసెంచరీలతో జట్టు స్కోరును 396కు చేర్చారు. ఈ భారీ స్కోరుతో ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యం ఉంచారు. ఇంగ్లాండ్ ఛేజింగ్‌లో ఇప్పటికే జాక్ క్రాలీ వికెట్ కోల్పోవడంతో టీమిండియా మరింత బలమైన స్థితిలో ఉంది.

2021లో ఇదే ఓవల్‌లో భారత్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడి గెలిచింది. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 466 పరుగులు చేసి, ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 210 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్లీ అదే ఆటతీరుతో గెలిచి టీమిండియా చరిత్రను పునరావృతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఒకవేళ ఇంగ్లాండ్ గెలవాలంటే చరిత్రను తిరగరాయాలి. నాలుగవ, ఐదవ రోజుల్లో పిచ్ బౌలర్లకు మరింత అనుకూలంగా మారుతుంది కాబట్టి, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు అద్భుతమైన సంకల్పం, ప్రదర్శన చూపించాలి. లేకపోతే, టీమిండియా గెలుపు ఖాయం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories