MS Dhoni: చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

MS Dhoni: వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లోనూ చెన్నై జ‌ట్టుకు ధోనీయే సార‌థ్యం

Sandeep Eggoju
Updated on: 17 Oct 2021 9:27 PM IST
The First Retention Card at the Auction will be Used for MS Dhoni CSK Official
X

వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లోనూ చెన్నై జ‌ట్టుకు ధోనీయే సార‌థ్యం (ఫైల్ ఇమేజ్)

MS Dhoni: ఐపీఎల్-14వ సీజన్‌ విక్టరీ సంబరాలు కొనసాగుతుండగానే ధోనీ ఫ్యాన్స్‌కు చెన్నై ప్రాంచైజీ గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటారన్న వార్తల నేపధ్యంలో ప్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లోనూ చెన్నై జ‌ట్టుకు ధోనీయే సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఆయ‌నను కొన‌సాగించే అంశంపై చెన్నై సూప‌ర్‌కింగ్స్ ప్రాంచైజీ సంస్థ స్పష్టత‌నిచ్చింది. ఐపీఎల్ వేలంలో తాము అట్టిపెట్టుకునే తొలి వ్యక్తి ధోనీయే అని ప్రక‌ట‌న చేసింది. కాగా, ఐపీఎల్-15లో మ‌రో రెండు కొత్త జ‌ట్లు ఎంటరవ్వనున్నాయి. మొత్తం 10 జ‌ట్లతో వచ్చే సీజన్ జ‌ర‌గ‌నుంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story