నాలుగో రోజు ముగిసిన ఇంగ్లండ్-ఇండియా మ్యాచ్

The England-India Match Ended on the Fourth Day
x

నాలుగో రోజు ముగిసిన ఇంగ్లండ్-ఇండియా మ్యాచ్

Highlights

India vs England: ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్-259/3

India vs England: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్-టీమిండియా ఐదో టెస్ట్ నాల్గో రోజు ఆట ముగిసింది. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. కేవలం 119 పరుగులు మాత్రమే చేస్తే ఇంగ్లండ్ టీం గెలుస్తుంది. ఆట ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఉత్కంఠ నెలకొన్నది. ఈ మ్యాచ్ లో భారత్ గెలువాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఒక వేళ వర్షం వచ్చి ఆట నిలిచిపోతే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది.

ఓవర్ నైట్ రెండో ఇన్నింగ్స్ ప్రారంబించిన టీమిండియా 120 పరగులు చేసి 245 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. పంత్ 57 పరుగులతో రాణించాడు. ఇప్పటికే 2-1 తో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ గెలువాలి లేదంటే డ్రా చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం 2-2 తో సిరీస్ సమానం అవుతుంది.

మరోవైపు.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో రిషబ్ పంత్ సత్తా చాటుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని ఓ రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే, విదేశీ గడ్డపై సెంచరీ తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ధోనీ నుంచి ఫరూఖ్ ఇంజనీర్ వరకు ఎవరూ ఈ ఘనత సాధించలేకపోవడం విశేషం.

ఐదో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమయం చేయాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తుంది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు (Rescheduled Match)లో భారత్ ఆధిక్యం 300 దాటింది.

మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్న ఇంగ్లాండ్‌ జట్టు ఆ దిశగా సాగుతోంది. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అతిథ్య జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 259 పరుగుల చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 119 పరుగులు కావాలి. అర్ధశతకాలతో చెలరేగిన జో రూట్‌(76), జానీ బెయిర్‌స్టో(72) క్రీజులో ఉన్నారు. ఇక ఒకరోజు ఆట మాత్రమే మిగిలిఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించాలంటే 7 వికెట్లు తీయాల్సిందే. ఒకవేళ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 125/3తో ఆట ప్రారంభించిన భారత్‌ మరో 120 పరుగులకే ఆలౌటైంది. పంత్‌(57) అర్ధశతకం చేశాడు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్‌ సిరీస్‌ నెగ్గాలంటే ఈ మ్యాచ్‌లో విజయమైనా సాధించాలి లేదా డ్రా అయినా చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గితే 2-2తో సిరీస్‌ సమం అవుతుంది.

ఇంగ్లాండ్‌ ఆటగాడు జోరూట్‌ (52) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 71 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్ధశతకం సాధించాడు. అతడికి జానీ బెయిర్‌స్టో (39) నుంచి మంచి సహకారం లభిస్తోంది. దీంతో వీరిద్దరూ ఇప్పటివరకు 90 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 46 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోర్‌ 201/3గా మారింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 177 పరుగులు కావాలి.

ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌ (43), జానీ బెయిర్‌ స్టో (22) ప్రమాదకరంగా మారుతున్నారు. ఇప్పటికే వీరిద్దరు 65 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ స్కోర్‌ 174/3గా నమోదైంది. 109కే మూడు వికెట్లు పడిపోయిన వేళ క్రీజులోకి వచ్చిన వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. మొదట వికెట్‌ కాపాడుకునేందుకు నెమ్మదిగా ఆడిన వీరి ఇప్పుడు క్రీజులో కుదురుకున్నాక బౌండరీలు బాదుతున్నారు. దీంతో ఇప్పటివరకు 95 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 204 పరుగులు కావాలి.

ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌ (20), జానీ బెయిర్‌స్టో (7) నిలకడగా ఆడుతున్నారు. స్వల్ప వ్యవధిలో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రూట్‌ రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా రెండు రివ్యూలను వృథా చేసుకుంది. ఇక షమి వేసిన 32వ ఓవర్లో రూట్‌ రెండు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్‌ 136/3గా ఉంది. ఇంకా విజయానికి 242 పరుగులు కావాలి.

టీ విరామం అనంతరం ఇంగ్లాండ్‌ తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో సెషన్‌ ఆరంభమైన తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో తొలుత పోప్‌(0) కీపర్‌ పంత్‌ చేతికి చిక్కాడు. తర్వాత జడేజా వేసిన మరుసటి ఓవర్‌ తొలి బంతికే అలెక్స్‌ లీస్‌ (56) రనౌటయ్యాడు. అంతకుముందు విరామానికి ముందు ఓపెనర్‌ క్రాలే (46) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జోరూట్‌ (2), జానీ బెయిర్‌స్టో (4) ఉన్నారు. 25 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 114/3గా నమోదైంది. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 264 పరుగులు కావాలి.

నాలుగో రోజు రెండో సెషన్‌ పూర్తయింది. ఈ సెషన్‌లో మొత్తం 31.5 ఓవర్ల ఆట సాగగా ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడుతోంది. టీ విరామ సమయానికి ఆ జట్టు 107/1తో నిలిచి వేగంగా పరుగులు సాధిస్తోంది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (56), జాక్‌ క్రాలే తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే బుమ్రా వేసిన 22వ ఓవర్‌లో క్రాలే బౌల్డయ్యాడు. దీంతో ఆ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం పోప్‌(0) క్రీజులోకి రాగా మరుసటి ఓవర్‌లోనే అంపైర్లు టీ విరామాన్ని ప్రకటించారు. ఈ రోజు ఇంకా 36 ఓవర్ల ఆట మిగిలి ఉండగా ఇంగ్లాండ్‌ విజయానికి 271 పరుగులే కావాలి.

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఎట్టకేలకు తొలి వికెట్‌ పడగొట్టింది. జాక్‌ క్రాలీ (46)ని కెప్టెన్‌ బుమ్రా చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో 107 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం విడిపోయింది. 22 ఓవర్లలో ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. అలెక్స్‌ లీస్‌ (56*), ఓలీ పోప్‌ (0*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 271 పరుగులు కావాలి.

ఇంగ్లాండ్‌ ఓపెనర్ల దూకుడు కొనసాగుతోంది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్‌ ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (54*), జాక్‌ క్రాలే (45*) దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో జట్టు స్కోరు వంద దాటింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. మరోవైపు వికెట్‌ కోసం భారత బౌలర్లు చేస్తున్న శ్రమ ఫలించడం లేదు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 274 పరుగులు కావాలి.

ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ లీస్‌ (53) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ వేసిన 15.5 ఓవర్‌కు అతడు బౌండరీ బాది 50 పరుగులను పూర్తిచేసుకున్నాడు. మరోవైపు జాక్‌ క్రాలే (27) అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. దీంతో వారిద్దరూ కలిసి 17 ఓవర్లలోనే జట్టు స్కోరును 81 పరుగులకు చేరవేశారు. మరోవైపు వీరిని ఔట్‌ చేసేందుకు భారత బౌలర్లు ఆపసోపాలు పడుతున్నారు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 297 పరుగులు కావాలి.

టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. అలెక్స్‌ లీస్‌ (31), జాక్‌ క్రాలే (21) మెరుగైన రన్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ 10 ఓవర్లకు 53 పరుగులు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ ఓపెనర్లను పెవిలియన్‌ పంపేందుకు టీమ్‌ఇండియా తీవ్రంగా కష్టపడుతోంది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 325 పరుగులు కావాలి.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు (Rescheduled Match)లో భారత్ ఆధిక్యం 300 దాటింది. ఓవర్‌నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 153 పరుగుల వద్ద పుజారా (Pujara) వికెట్‌ను కోల్పోయింది. 168 బంతులు ఎదుర్కొన్న పుజారా 66 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగులో అవుటయ్యాడు. పుజారా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మరోమారు విఫలమయ్యాడు. 19 పరుగులు మాత్రమే చేసి మాటీ పాట్స్ బౌలింగులో వెనుదిరిగాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories