టెన్నిస్ టోర్నీల షెడ్యూల్.. మెగా టోర్నిలోనే ఆడనున్న స్టార్ ప్లేయర్లు

టెన్నిస్ టోర్నీల షెడ్యూల్.. మెగా టోర్నిలోనే ఆడనున్న స్టార్ ప్లేయర్లు
x
Highlights

టెన్నీస్ అభిమానులకు ఈ ఏడాది మొదట్లోనే గ్రాండ్ స్లామ్ టోర్ని కనువిందు చేయనుంది. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ జనవరి నుంచి ప్రారంభం కానుంది.

టెన్నీస్ అభిమానులకు ఈ ఏడాది మొదట్లోనే గ్రాండ్ స్లామ్ టోర్ని కనువిందు చేయనుంది. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జనవరి 20 వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు మెల్ బోర్న్ పార్క్‌లో జరగనుంది.

మొదటిసారి 1905లో ప్రారంభమైంది. టెన్నిస్ ఆటలో ప్రతి సంవత్సం గ్రాండ్‌స్లామ్‌గా పరిగణించే 4 పోటీల్లో మొదటిది. పురుషుల సింగిల్స్, మహిళలక సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్స్ కేటగిరిలో పోటీలను నిర్వహిస్తారు. ఇక ఇదే సంవత్సరం మే నెలలో ఫ్రెంచ్ ఓపెన్, జూన్ నుంచి వింబుల్డన్, ఆగస్టు 31న యుఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది.

అయితే ఈ సారి గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్టార్ ప్లేయర్ల పాల్గొన్ననున్నారు. ఈ గ్రాండ్ స్లామ్ పాల్గొనే క్రీడాకారుల జాబితాను ఇటీవలే నిర్వాహాకులు ప్రకటించారు. మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా మినహా టాప్‌-50 ప్లేయర్లు పాల్గొననున్నారు. ఇక పురుషుల్లో విభాగంలో అగ్రస్థానంలో స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌ ఈ టోర్నీలో ప్రాధానాకర్షణగా నిలవగా, మహిళల విభాగంలో ఆష్లే బార్టీ ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఎనిమిదో గ్రాండ్ స్లామ్‌ టోర్నీ విజయంపై నొవాక్‌ జొకోవిచ్‌ కన్నేశాడు. దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ తన తన కెరీర్‌లో 7వ గ్రాండ్ స్లామ్ ట్రోఫ్రీని సాధించాలని పట్టుదలతో ఉన్నాడు

మహిళల విభాగంలో ఏడుసార్లు ఛాంపియన్‌ నిలిచిన సెరెనా విలియమ్స్‌ మళ్లి విజయంపె గురిపెట్టింది. మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును సమయం చేయాలని చూస్తుంది. ఆస్ట్రేలియన్ టెన్నీస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్‌ తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల ఆడిన క్రీడాకారినిగా రికార్డును కైవసం చేసుకుంది. నొవోమి ఒసాకా (జపాన్‌), కరోలిన్‌ వోజ్నియాకి, సెరెనా విలియమ్స్‌, నొవాక్‌ జొకోవిచ్‌ , రోజర్‌ ఫెదరర్‌ , రఫెల్‌ నాదల్‌ దిగ్గజ ప్లేయర్లతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ సందడిగా మారనుంది

అయితే 32 ఏళ్ల బ్రిటన్‌ స్టార్‌ ప్లేయర్ ఆండీ ముర్రే గ్రాండ్ స్లామ్ లో పొల్గొనడం లేదు. పొత్తి కడుపు నొప్పి కారణంగా ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే ప్రకటించాడు.

టెన్నిస్ షెడ్యూల్ ఇదే:

జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ, ఫిబ్రవరి 3–9 వరకు వరకు పుణేలో టాటా ఓపెన్‌ టోర్నీ , మార్చి 6 నుంచి 7 వరకు డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌, మార్చి 12 నుంచి22 వరకు ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ , మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 5 మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ , ఏప్రిల్‌ 12 నుంచి19 వరకు మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ , మే 3 నుంచి10 వరకు మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ ,మే 10 నుంచి 17 వరకు రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ , మే 24 నుంచి జూన్‌ 7 వరకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ , జూన్‌ 29 నుంచి జూలై 12 వరకు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ , జూలై 17 నుంచి18 వరకు డేవిస్‌ కప్‌ గ్రూప్‌–2 మ్యాచ్‌లు , ఆగస్టు 10 నుంచి16 వరకు రోజర్స్‌ కప్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ , ఆగస్టు 16 నుంచి 23 వరకు సిన్సినాటి మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ , ఆగస్టు 31నుంచి సెప్టెంబర్‌ 13 వరకు యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ , సెప్టెంబర్‌ 18 నుంచి 19 వరకు డేవిస్‌ కప్‌ గ్రూప్‌–1, 2 మ్యాచ్‌లు ,అక్టోబర్‌ 11నుంచి 18 వరకు షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ ,నవంబర్‌ 2 నుంచి 8 వరకు పారిస్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ నవంబర్‌ 15 నుంచి 22 వరకు సీజన్‌ ముగింపు ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ , నవంబర్‌ 23 నుంచి 29 వరకు డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌ ఈ సంవత్సరం జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories