Virat Kohli: ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం..

Team Indias Star Batsman Virat Kohli Revealed That He Will Not Be Available For The First Two Tests Against England
x

Virat Kohli: ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం.. 

Highlights

Virat Kohli: కోహ్లీ దూరంగా ఉంటున్నాడని తెలిపిన బీసీసీఐ

Virat Kohli: మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుండగా టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అనూహ్యంగా తొలి రెండు టెస్టులకు దూరంగా ఉంటున్నట్టు తెలిపాడు. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. తొలి టెస్టుకోసం కోహ్లీ ఈ నెల 21న హైదరాబాద్‌ చేరుకున్నాడు. 25 నుంచే హైదరాబాద్‌లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుండగా, రెండో టెస్టు విశాఖపట్నంలో ఫిబ్రవరి 2 నుంచి జరుగుతుంది.

ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల్లో ఆడలేనని విరాట్‌ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఈ విషయమై కెప్టెన్‌ రోహిత్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లతో కూడా తాను మాట్లాడాడు. దేశం తరఫున ఆడడం గర్వకారణమే అయినా.. ఈ సమయంలో కుటుంబంతో గడపాల్సిన కచ్చితమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. బీసీసీఐ కూడా విరాట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తూ అతడికి మద్దతుగా నిలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories