మూడో టీ-20 సిరీస్ లో టీమిండియా ఘన విజయం

Team India Won the Third T-20 Series
x

మూడో టీ-20 సిరీస్ లో టీమిండియా ఘన విజయం

Highlights

IND vs WI 3rd T20: 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై టీమిండియా గెలుపు

IND vs WI 3rd T20: వెస్టిండీస్ తో మూడో టీ-20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ 165 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే భారత జట్టు చేధించింది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరినా ఓపెనర్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోగియ్ శర్మ ఐదు బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి స్కోర్ పెంచాడు సూర్యకుమార్ యాదవ్.

ఇద్దరూ కలిసి తొలి వికెట్ కి 90 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 27 బంతుల్లో రెండు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. అకిల్ హుస్సేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన హార్ధిక్ పాండ్యా నాలుగు పరుగులు చేసి నిరాశపరిచినా రిషిబ్ పంత్ 26 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 33 పరుగులు చేశాడు. దీపక్ హుడా ఏడు బంతుల్లో ఒక ఫోర్ తో పది పరుగులు చేసి మ్యాచ్ విజయానికి సహకరించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories