ట్రినిడాడ్ టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం

Team India Won Against West Indies
x

ట్రినిడాడ్ టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం

Highlights

WI vs IND 1st T20: 68 పరుగులతో విజయం సాధించిన రోహిత్ సేన

WI vs IND 1st T20: వెస్టిండీస్‌తో జరిగిని తొలి టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలిమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్ కెప్టన్ పూరన్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేయగలిగింది. దీంతో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచుల సిరీస్‌లో తొలిమ్యాచ్‌లో విజయంతో టీమిండియా బోణీ కొట్టింది.

బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపనర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆరంభాన్నిచ్చారు. కెప్టన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో ఏడు బౌండరీలు, రెండు సిక్సర్లతో 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దినేశ్ కార్తిక్ ఇన్నింగ్స్ చివరలో అద్భుతమైన బ్యాటింగ్ శైలితో 19 బంతుల్లో నాలుగు బౌండరీలు రెండు సిక్సర్లతో 41 పరుగులు అందించిం జట్టు స్కోరు పెరుగుదలలో కీలక పాత్రపోషించాడు. దీంతో దినేశ్ కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వెస్టిండీస్ ఆటగాళ్ల దూకుడుకు టీమిండియా బౌలర్లు కళ్లెం వేసి తక్కువ పరుగులకే పరిమితం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories