ఇంగ్లాండ్ పర్యటనలో సత్తా చాటిని భారత మహిళా జట్టు

Team India Women win by 8 wickets | Sports News
x

ఇంగ్లాండ్ పర్యటనలో సత్తా చాటిని భారత మహిళా జట్టు

Highlights

డెర్బీలో జరిగిన రెండో టీ20లో ఘనవిజయం

IND-W Vs ENG-W: ఇంగ్లాండు పర్యటనలో ఉన్న టీమిండియా మహిళలు సత్తా చాటారు. డెర్బీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లాండు జట్టుకు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండు బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేయడంలో భారత బౌలర్లు సఫలీకృతమయ్యారు. ఇంగ్లాండు బ్యాటర్లు ఆరు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేశారు. టీమిండియా మహిళా బౌలర్లు స్నేహా రాణా మూడు వికెట్లు, రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు.

143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకిదిగిన టీమిండియా రెండు వికెట్లను కోల్పోయి... 16 ఓవర్ల నాలుగు బంతుల్లో విజయతీరం చేరింది. స్మృతి మందానా, హర్మన్ ప్రీత్‌ కౌర్ జోడీ అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. స్మృతి మందానా 53 బంతులు ఎదుర్కొని 13 బౌండరీలతో 79 పరుగులు నమోదు చేసి టాప్ స్కోరర్‌గా అజేయంగా నిలిచింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. కెప్టన్ హర్మన్ ప్రీత్ కౌర్ 29 పరుగులతో అజేయంగా నిలించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories